Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone: ఇకపై ఇండియాలోనే ఐఫోన్ ఉత్పత్తి కేంద్రాలు.. వెల్లడించిన యాపిల్ సంస్థ

ఐఫోన్ దీనిని జీవితంలో ఒకసారైనా కొనాలని భావిస్తూ ఉంటారు సామాన్యులు. దీని ఫీచర్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇందులోని ప్రాసెసర్ ఏ విధమైన సమస్యలు తలెత్తనివ్వకుండా చేస్తుంది. డేటా హ్యాకింగ్ వంటి విషయాల్లో చాలా పటిష్ఠమైన సెక్యూరిటీ సిస్టం ఉంటుంది. కెమెరా ఫీచర్ల విషయానికొస్తే మంచి పనితీరును కనబరుస్తాయి. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తారు. ఈ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సంస్థను మన భారతదేశంలో నెలకొల్పేందుకు

Apple iPhone: ఇకపై ఇండియాలోనే ఐఫోన్ ఉత్పత్తి కేంద్రాలు.. వెల్లడించిన యాపిల్ సంస్థ
Iphone 17 May Be Developed In India From 2024 July As Tata Group Ties Up With Apple
Follow us
Srikar T

|

Updated on: Nov 03, 2023 | 5:23 PM

ఐఫోన్ దీనిని జీవితంలో ఒకసారైనా కొనాలని భావిస్తూ ఉంటారు సామాన్యులు. దీని ఫీచర్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇందులోని ప్రాసెసర్ ఏ విధమైన సమస్యలు తలెత్తనివ్వకుండా చేస్తుంది. డేటా హ్యాకింగ్ వంటి విషయాల్లో చాలా పటిష్ఠమైన సెక్యూరిటీ సిస్టం ఉంటుంది. కెమెరా ఫీచర్ల విషయానికొస్తే మంచి పనితీరును కనబరుస్తాయి. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తారు. ఈ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సంస్థను మన భారతదేశంలో నెలకొల్పేందుకు కాంట్రాక్టర్లు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ద్వితీయార్థలో అంటే జూలై తరువాత ఐఫోన్ 17 మోడల్‌ని భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. దీనికి టాటా గ్రూప్ సహకారం అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యాపిల్ ఫోన్ల తయారీదారులైన ఫాక్సాన్, ఫెగాట్రాన్‌లు టాటా గ్రూప్‌తో అనుసంధానమై 125 మిలియన్ డాలర్ల ఉత్పత్తి పరికరాలను కొనుగోలు చేశాయి. 2024 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని ఉత్పత్తి దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి ఎక్కువగా చైనా నుంచి జరుగుతుంది. అయితే కొన్ని పారిశ్రామిక సమస్యల కారణంగా భారతదేశంలో పెట్టుబడుడులు పెట్టి ఉత్పత్తి యూనిట్లును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే చైనాలోని తైవాన్, జెంగ్ జౌ పారిశ్రామిక వాడల్లో పెట్టుబడి పెట్టేందుకు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో 35% నుంచి 45% ఉత్పత్తులు తగ్గించిన యాపిల్ సంస్ధ రానున్న రోజుల్లో దీనిని 75% నుంచి 85% తగ్గించాలని భావిస్తోందని ఈ సంస్థకు చెందిన సెక్యూరిటీ విశ్లేషకుడు తెలిపారు. ఈ తగ్గించిన పెట్టుబడులను భారత్‌లో పెట్టేందుకు సుముఖంగా ఉంది ఈ దిగ్గజ సంస్థ.

భారతదేశంలో ఉత్పత్తిని విస్తరించడంతో పాటు, ఐఫోన్ ఆర్డర్ కేటాయింపులో షేర్స్ వేగంగా పెరగడం ప్రొడక్షన్ లైన్ ఆటోమేషన్‌లో మెరుగుదలకు కారణం అవుతుందని ఐఫోన్ అధినేత కువో తెలిపారు. డిజైన్ రిస్క్‌ను తగ్గించుకోవడం కోసం సాధారణ మోడల్స్, డిజైన్స్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే, 2024 నాటికి భారతదేశంలో తయారైన ఐఫోన్‌ల నిష్పత్తి 20- 25%కి పెరుగుతుందని చెప్పారు. భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం 75-80% ఫాక్స్‌కాన్ సంస్థ సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు ఒక పరిశోధనలో తెలిపారు. భారతదేశానికి చెందిన టాటాను ఐఫోన్ అసెంబ్లర్‌గా మార్చడం ద్వారా పారిశ్రామిక రంగంలో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా భారతదేశంలో ఐఫోన్లతోపాటూ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

రాబోయే దశాబ్దంలో ఆపిల్ వృద్ధికి కీలకం అని కువో చెప్పారు. ఐఫోన్ ఎస్ఈ (iPhone SE) అనేది 2017లో ఫాక్స్‌కాన్‌చే ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం, యాపిల్ ప్రస్తుతం చైనాలో కేంద్రీకృతమై ఉన్న దాని తయారీ సామర్థ్యాన్ని.. 2025 నాటికి 25% భారతదేశానికి మార్చాలని యోచిస్తోంది. ఐఫోన్ ఉత్పత్తికి చైనా సహకారం 2022లో 93.5% నుండి 2023లో గ్లోబల్ షిప్‌మెంట్‌లలో 91.2%కి తగ్గుతుందని అంచనా వేయబడింది. ఈ సంవత్సరం చివరి నాటికి, భారతదేశ సహకారం గత సంవత్సరంతో పోలిస్తే 5-7% నుండి 10%కి పెరుగుతుంది. 2022లో 6 మిలియన్ యూనిట్లకు షిప్పింగ్ చేసిన రికార్డులు 2023నాటికి 9 మిలియన్ యూనిట్లను అధిగమిస్తాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు ఫ్లాట్‌గా ఉన్న సమయంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ తన అత్యధిక త్రైమాసిక షిప్‌మెంట్‌లను నమోదు చేసింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. యాపిల్ క్వార్టర్3 లో సంవత్సర వృద్ధిని 34% నమోదు చేసింది. ఇది దేశంలో ఆపిల్ ఎగుమతులకు అత్యుత్తమ త్రైమాసికంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది 2.5 మిలియన్ యూనిట్లను దాటింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..