Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై రీల్స్‌కు కూడా..

ఫేస్‌బుక్‌ను మించిన ఫీచర్స్‌తో సోషల్‌ మీడియా రంగంలో ఇన్‌స్టాగ్రామ్‌ దూసుకుపోతోంది. ఎప్పుటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యువత అభిరుచి, ఇష్టాలు, ప్రైవసీకి అనుగుణంగా లేటెస్ట్‌ ఫీచర్స్‌ను తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో అధునాతన ఫీచర్లను పరిచయం చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా...

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై రీల్స్‌కు కూడా..
Instagram New Feature
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 04, 2023 | 8:52 AM

అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువతకు అత్యంత వేగంగా చేరువైంది. ఇందులోని ఫీచర్స్‌, ప్రైవసీ కారణంగా యూత్‌ పెద్ద ఎత్తున ఇన్‌స్టాగ్రామ్‌కు అట్రాక్ట్ అయ్యారు.

ఫేస్‌బుక్‌ను మించిన ఫీచర్స్‌తో సోషల్‌ మీడియా రంగంలో ఇన్‌స్టాగ్రామ్‌ దూసుకుపోతోంది. ఎప్పుటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యువత అభిరుచి, ఇష్టాలు, ప్రైవసీకి అనుగుణంగా లేటెస్ట్‌ ఫీచర్స్‌ను తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో అధునాతన ఫీచర్లను పరిచయం చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లు ఇన్‌స్టా స్టోరీలకు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలు ఇంతలా పాపులర్‌ కావడానికి ప్రధాన కారణం పాటల లిరిక్స్‌ను యాడ్ చేసే ఫీచర్‌ ఉండడమే. స్టోరీలకు పాటల లిరిక్స్‌ను జోడించుకునే ఫీచర్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను రీల్స్‌కు కూడా యాడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్ స్వయంగా తెలిపారు. అయితే ఇంతకు ముందు రీల్స్‌లోని పాటలకు లిరిక్స్‌ యాడ్ చేసుకోవాలంటే మనమే స్వయంగా టైప్‌ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై అవసరం ఉండని జుకర్‌ బర్గ్ తెలిపారు. రీల్స్‌కు భారీగా ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను జోడించినట్లు ఆయన వివరించారు. ఇక ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ క్రియేట్ చేసి మ్యూజిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, మీకు కావాల్సిన పాటను సెలక్ట్ చేసకొని.. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయగానే లిరిక్స్ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..