iPhone Launching: యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. విడుదల తేదీ లీక్‌..!

iPhone Launching: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న..

iPhone Launching: యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. విడుదల తేదీ లీక్‌..!
Iphone 13
Follow us
Subhash Goud

|

Updated on: Aug 28, 2021 | 9:56 PM

iPhone Launching: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అత్యాధునిక ఫీచర్స్‌తో ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే కొన్ని ఫోన్లు మార్కెట్లో విడుదల కాకముందే ఫీచర్స్‌ లీకైపోతున్నాయి. ఇక ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వచ్చే నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. సెప్టెంబర్ 14వ తేదీన యాపిల్ కొత్త ఫోన్లు మార్కెట్లో విడుదల కానున్నాయని లీకులు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉండనున్నాయి.

ఈ నాలుగు ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే సేల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్‌కు ముందు యాపిల్ తన ఉత్పత్తులను సెప్టెంబర్‌లో తప్పకుండా విడుదల చేసేది. సెప్టెంబర్ నెల మొదటి లేదా రెండో మంగళవారంలో ఈ కార్యక్రమం జరిగేది. గత సంవత్సరం లాక్‌డౌన్‌ల కారణంగా దీని సేల్ కాస్త ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు మళ్లీ కరోనా మహమ్మారి ముందు టైమింగ్‌లను యాపిల్ అనుసరించే అవకాశం ఉంది.

ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఇందులో కొత్తగా సన్‌సెట్ గోల్డ్ అనే కొత్త కలర్ వేరియంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు, భవిష్యత్తులో లాంచ్ అయ్యే ఐప్యాడ్ మోడల్స్ కోసం ఈ డిస్‌ప్లేను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎల్టీపీవో టెక్నాలజీతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను శాంసంగ్ రూపొందిస్తుంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రోల్లో ఈ ఫోన్ డిస్‌ప్లే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్లలో 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉన్న ఫోన్లు ఇవే కానున్నాయి.

ఇవీ కూడా చదవండి:

September 1: సెప్టెంబర్‌ 1 నుంచి ఈ అంశాల్లో మార్పులు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను కూడా లాక్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?

Google Apple Deal: గూగుల్‌-ఆపిల్ మధ్య కళ్లు చెదిరి డీల్‌.. లక్షా పదివేల కోట్లతో ఒప్పందం