Instagram: ఇన్‌స్టా లవర్స్‌కి సూపర్ ఫీచర్.. ఫొటోలను పోస్ట్ చేసిన తర్వాత కూడా..
అకేషన్ ఏదైనా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాల్సిందే. ప్రస్తుతం యువత ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. అయితే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఫొటోలు మనకు నచ్చవు. ఫొటోను కాస్త ఎడిట్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే ఒక్కసారి పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలేం. కానీ ఇన్‌స్టాలో తీసుకొచ్చే కొత్త ఫీచర్‌తో ఇకపై ఆ సమస్య ఉండదు...

యువతను అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేసుకొని తీసుకొస్తున్న ఫీచర్స్ కారణంగానే ఇన్‌స్టాకు ఇంతటి ఫాలోయింగ్.
అకేషన్ ఏదైనా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాల్సిందే. ప్రస్తుతం యువత ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. అయితే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఫొటోలు మనకు నచ్చవు. ఫొటోను కాస్త ఎడిట్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే ఒక్కసారి పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలేం. కానీ ఇన్‌స్టాలో తీసుకొచ్చే కొత్త ఫీచర్‌తో ఇకపై ఆ సమస్య ఉండదు. పోస్ట్ చేసిన ఫొటోను కూడా ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కేవలం ఎడిటింగ్‌కే పరిమితం కాకుండా.. క్యాప్షన్ కూడా మార్చుకోవచ్చు.
అప్పటికే పోస్ట్ చేసిన ఫొటోకు ఫిల్టర్స్, ఎఫెక్ట్‌లను జోడించుకోవచ్చు. అలాగే క్యాప్షన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. పోస్ట్ చేసిన తర్వాత తప్పులను సరిదిద్దుకునే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
* అనంతరం ప్రొఫైల్‌లోకి వెళ్లి.. ఎడిట్ చేయాలనుకున్న పోస్టును సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత పోస్ట్‌కు కుడ వైపు టాప్‌లో ఉండే ఎలిప్సెస్ ను క్లిక్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్ పై ట్యాప్ చేయాలి.
* దీంతో అక్కడ మెనులో ‘ఎడిట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.
* ఫొటోను ఎడిట్ చేయాలనుకుంటే దానిపై ట్యాప్ చేయడం వల్ల ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి. అనంతరం మీరు కోరుకున్న మార్పులు చేసి స్క్రీన్ కుడివైపు టాప్‌లో ఉన్న సేవల్ బటన్‌ను నొక్కాలి. అంతేకాకుండా మీ ఫొటో, క్యాప్షన్, లొకేషన్‌ట్యాగ్స్‌ను మార్చుకునే అవకాశ ఉంటుంది.
* చివరిగా ఎడిట్ చేసిన పోస్టు మీకు కనిపిస్తుంది. మార్పులు చేసిన ఫొటో నచ్చిటనట్లైతే.. ఓకే లేదంటే మళ్లీ ఎడిట్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..