Instagram: టీనేజ్ పిల్లల భద్రతే లక్ష్యంగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇకపై వారి పప్పులు ఉడకవు.
Instagram: సోషల్ మీడియాతో ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే...
Instagram: సోషల్ మీడియాతో ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే వారిని టార్గెట్ చేస్తూ కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. టీనేజర్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు పంపుతూ వికృత ఆనందాన్ని పొందుతున్నారు. అయితే ఇకపై వారి పప్పులు ఉడకవు అంటోంది ఇన్‌స్టాగ్రామ్. ఇలాంటి పోకిరీలకు చెక్ పెడుతూ టీనేజ్ పిల్లల భద్రతే లక్ష్యంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
16 నుంచి 18 ఏళ్ల వయసున్న వారు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయగానే ఆ అకౌంట్ దానంతలా అదే ప్రైవేట్ అకౌంట్‌గా మారిపోతుంది. ఈ డిఫాల్ట్ ప్రైవేట్ అకౌంట్ వల్ల అపరిచితుల నుంచి అనుచిత మెసేజ్‌లు టీనేజర్లకు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. ఒకవేళ ఇప్పటికే అకౌంట్ క్రియేట్ చేసుకున్న టీనేజర్లకు ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకోమని నోటిఫికేషన్ వస్తుంది. అయితే అకౌంట్‌ను ప్రైవేటుగా మార్చుకునే స్వేచ్ఛ యూజర్లకే ఇచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఈ కొత్త ఫీచర్ ద్వారా.. టీనేజర్లు ఎక్కువగా బ్లాక్ చేసిన అకౌంట్‌ను అనుమానాస్పద అకౌంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాగ్ చేస్తుంది. దీంతో ఇతరులు కూడా సదరు వ్యక్తి నుంచి వచ్చే యాడ్ రిక్వెస్ట్‌ను అనుమతించకుండా జాగ్రత్త పడొచ్చు. అంతేకాకుండా సదరు వ్యక్తి నుంచి టీనేజ్ పిల్లలకు మెసేజ్‌లు వెళ్లకుండా ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసేస్తుంది. ఈ అనుమానాస్పద అకౌంట్‌లకు టీనేజర్ల నోటిఫికేషన్లు, వారు చేసే రీల్స్ కూడా కనిపించవు. ఎన్నో భద్రత పరమైన అంశాలతో తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ నిజంగానే భలే ఉంది కదూ.
Also Read: Google: స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్ సంచలన నిర్ణయం.. ఈ ఫోన్‌లలో జీమెయిల్, యూట్యూబ్ ఇక పని చేయవు..!