Twitter Shop Module: ఇకపై ట్విట్టర్‌లో ట్వీట్స్ మాత్రమే కాదు.. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మరో కొత్త ఫీచర్..
Twitter Shop Module: ప్రస్తుతం టెక్నాలజీ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియా రాకతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని రంగాలను సోషల్ మీడియా శాసించే రోజులు వచ్చేశాయి. ముఖ్యంగా...
Twitter Shop Module: ప్రస్తుతం టెక్నాలజీ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియా రాకతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని రంగాలను సోషల్ మీడియా శాసించే రోజులు వచ్చేశాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలోనూ సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం సమాచారమే కాకుండా షాపింగ్ కూడా సోషల్ మీడియా సైట్ల ద్వారా చేసుకునే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తమ సైట్లలోనే షాపింగ్ చేసుకునే వెసులుబాటు కలిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా వచ్చి చేరింది.
ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న ట్విట్టర్ తాజాగా ‘షాప్ మాడ్యూల్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వ్యాపారులు తమ బ్రాండ్స్‌ను వారి ప్రొఫైల్ పైభాగంలో ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజర్లు సైతం ప్రాడక్ట్స్‌ను అక్కడే కొనుగోలు చేసుకునే వీలు కల్పించారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను ఐఓస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌తో మరో షాపింగ్ సైట్‌కు వెళ్లకుండా ట్విట్టర్ యాప్‌లోనే ఉండి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.
Whatsapp Case: వాట్సాప్‌పై రష్యా సీరియస్.. చట్టపరమైన చర్యలకు పూనుకున్న ప్రభుత్వం. కారణమేంటంటే..