Linkedin: ఇకపై శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.. ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన లింక్‌డిన్‌.. కానీ..

Linkedin: కరోనా కారణంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయంలో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని...

Linkedin: ఇకపై శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.. ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన లింక్‌డిన్‌.. కానీ..
Work From Home
Follow us

|

Updated on: Aug 01, 2021 | 8:55 AM

Linkedin: కరోనా కారణంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయంలో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలభించాయి. మునుపెన్నడూ ఈ విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం కరోనా దెబ్బకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని పాటించక తప్పని పరిస్థితి వచ్చింది. చాలా వరకు కంపెనీలు దాదాపు ఏడాదిన్నరగా ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని కలిపించాయి. ఇక కంపెనీలకు సైతం ఖర్చులు కలిసి రావడంతో ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గినా కంపెనీలు ఇంకా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్నే పాటిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కొన్ని కంపెనీలైతే ఏకంగా శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ లింక్‌డిన్‌ వచ్చి చేరింది. మైక్రోసాఫ్ట్‌ అనుబంధ సంస్థ అయిన లింక్‌డిన్‌.. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగులు తమకు నచ్చిన పని అవకాశాన్ని ఎంచుకునేలా ఆప్షన్‌ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ సమయానికి అనుకూలంగా పార్ట్‌ టైమ్‌గా ఆఫీసుకు వచ్చి పనిచేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే లింక్‌డిన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంది పనిచేస్తున్నారు. ఇక కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిన కొందరు ఉద్యోగులు మాత్రం రావాల్సిందేనని సంస్థ తెలిపింది. అయితే ఉద్యోగులు ఒకవేళ తమ నివాసాన్ని మారిస్తే మాత్రం ఆ ప్రాంతానికి అనుగుణంగా జీతాల్లో మార్పులు చేస్తామని యాజమాన్యం తెలిపింది.

Also Read: Twitter Shop Module: ఇకపై ట్విట్టర్‌లో ట్వీట్స్‌ మాత్రమే కాదు.. షాపింగ్‌ కూడా చేసుకోవచ్చు. మరో కొత్త ఫీచర్‌..

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు శుభవార్త..! నేరుగా ఇంటికి ఆన్‌లైన్‌ డెలివరీ..

Sandes App: లోక్‌ సభలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన.. వాట్సాప్‌ తరహాలో ‘సందేశ్‌’ యాప్‌