Infinix Smart 8: రూ.10వేల లోపు ధరలో 16జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్.. హై ఎండ్ ఫీచర్లు..

మన దేశీయ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ వచ్చింది. అతి తక్కువ బడ్జెట్లో టాప్ క్లాస్ స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8. ఇది 128జీబీ స్టోరేజ్ వేరియంట్ గా అందుబాటులో ఉంది. వాస్తవానికి గత నెలలోనే ఇది మార్కెట్లోకి వచ్చినా అది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో వచ్చింది. కాగా ఇప్పుడు తొలిసారిగా 128జీబీతో వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది.

Infinix Smart 8: రూ.10వేల లోపు ధరలో 16జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్.. హై ఎండ్ ఫీచర్లు..
Infinix Smart 8
Follow us
Madhu

|

Updated on: Feb 10, 2024 | 6:21 AM

మన దేశీయ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ వచ్చింది. అతి తక్కువ బడ్జెట్లో టాప్ క్లాస్ స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8. ఇది 128జీబీ స్టోరేజ్ వేరియంట్ గా అందుబాటులో ఉంది. వాస్తవానికి గత నెలలోనే ఇది మార్కెట్లోకి వచ్చినా అది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో వచ్చింది. కాగా ఇప్పుడు తొలిసారిగా 128జీబీతో వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 128జీబీ: ధర, ఆఫర్‌లు..

ఈ వేరియంట్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. దీని ధర రూ.8,999 . ప్రారంభ ఆఫర్‌గా ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలతో ఫ్లాట్ రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే కొనుగోలుదారులు రూ. 699 వద్ద మ్యూజిక్ యాప్ స్పాటిఫై ప్రీమియం వార్షిక సభ్యత్వాన్ని పొందే ఎంపికను కూడా పొందుతారు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8: స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..

ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 500నిట్స్ బ్రైట్ నెస్ తో 90హెర్జ్ ఎల్సీడీ స్క్రీన్‌ని అందించే బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్. ఇది మీడియా టెక్ హీలియో జీ36 ఎస్ఓసీని కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ షూటర్‌తో కూడిన డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది 5,000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్, యూఎస్బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.

డిస్ప్లే: 6.6-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే హెచ్డీ ప్లస్ (1612 × 720 పిక్సెల్) రిజల్యూషన్, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్, 180హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో జీ36 ఎస్ఓసీ ఉంటుంది.

ర్యామ్: 8జీబీ ర్యామ్ తో పాటు మరో 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ అంటే మొత్తం 16జీబీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది.

స్టోరేజ్: 128జీబీ అంతర్గత నిల్వ, ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్

సాఫ్ట్‌వేర్: ఎక్స్ఓఎస్ 13, ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)

కెమెరాలు: 50ఎంపీ ప్రైమరీ షూటర్, ఏఐ లెన్స్ క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్

ఫ్రంట్ కెమెరా: ఎల్ఈడీ ఫ్లాష్‌తో 8ఎంపీ షూటర్

బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

ఛార్జింగ్: యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 10వాట్ల ఛార్జింగ్

భద్రత: సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

ఆడియో: డీటీఎస్ సౌండ్

కనెక్టివిటీ: డ్యూయల్-సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్

రంగు ఎంపికలు: గెలాక్సీ వైట్, రెయిన్బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!