Infinix Note 30 VIP: ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. BMW డిజైన్‌తో అదిరిపోయే లుక్స్‌లో..
లుక్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది. బీఎమ్‌డబ్ల్యూ డిజైన్ వర్కర్స్‌తో చేతులు కలిపి ఈ ఫోన్‌ను డిజైన్‌ను చేశారు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్‌లో బీఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కు సంబంధించిన లోగోలు కనిపించేలా డిజైల్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. దీంతో పాటు 50 వాట్స్‌కు సపోర్ట్ చేసే వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 వీఐపీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేశారు. నోట్ 30 వీఐపీ రేసింగ్ ఎడిషన్ పేరుతో ఈ మొబైల్‌ను లాంచ్ చేశారు. పేరుకు తగ్గట్లుగానే ప్రముఖ కార్ల కంపెనీ అయిన బీఎమ్‌డబ్ల్యూ థీమ్‌ను బేస్ చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేశారు.
లుక్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది. బీఎమ్‌డబ్ల్యూ డిజైన్ వర్కర్స్‌తో చేతులు కలిపి ఈ ఫోన్‌ను డిజైన్‌ను చేశారు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్‌లో బీఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కు సంబంధించిన లోగోలు కనిపించేలా డిజైల్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. దీంతో పాటు 50 వాట్స్‌కు సపోర్ట్ చేసే వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 వీఐపీ రేసింగ్ ఎడిషన్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎంపిక చేసిన కొన్ని దేశాల్లోనే విడుదల చేశారు. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 315 డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 26,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేయనున్నారన్నదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అలాగే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడి ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 1,080 x 2,400 పిక్సెల్స్, 120 హెచ్‌జెడ్ రిఫ్రేష్ రేట్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో డైమెన్సిటీ 8050 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 2 ఎంపీతో కూడిన ఒక డెప్త్, మరో మాక్రో కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 256 జీబీ ఇంటర్నల్ మెమోరీతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 2టీబీ వరకు మెమోరీని పెంచుకునే అవకాశం ఉంది. ఇక 5జీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో వైఫై 6, బ్లూటూత్, ఓటీజీ, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




