- Telugu News Photo Gallery Technology photos Tecno launching new slim laptop Tecno megabook t1 features and price details Telugu Tech News
Tecno Megabook T1: ఈ ల్యాప్‌టాప్ చాలా స్లిమ్ గురూ.. ధర కూడా తక్కువేనండోయ్..
ప్రస్తుతం మార్కెట్లో ల్యాప్‌టాప్‌ల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరగడంతో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో కంపెనీలు సైతం తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎలక్ట్రానిక్ దిగ్గజం టెక్నో కొత్త ల్యాప్‌ను లాంచ్ చేసింది. టెక్నో మెగాబుక్ టీ1 పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 16, 2023 | 3:46 PM

ప్రముఖ ఎలాక్ట్రానిక్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి టెక్నో మెగాబుక్ టీ1 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.56 కిలోల బరవు ఉండడం విశేషం.

ధర విషయానికొస్తే టెక్నో మెగాబుక్ టీ1 11th జనరేషన్ ఐ3 కాన్పిగనరేషన్ ధర రూ. 37,999 కాగా ఐ5 కాన్ఫిగరేషన్ ధర రూ. 47,999గా ఉంది. ఇక ఐ7 కాన్ఫిగరేషన్ ధర రూ. 57,999గా ఉంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. డెనిమ్ బ్లూ, స్పేస్ గ్రే, మూన్‌షైన్ సిల్వర్ కలర్స్‌లలో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ వెబ్ క్యామ్‌ను అందించారు.

ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు.

చార్జింగ్ కోసం టైప్ సీ పోర్ట్‌ను ఇచ్చారు. అలాగే 65 వాట్స్ పీడీ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 70డబ్ల్యూహెచ్‌ఆర్ బ్యాటరీని అందించారు. ఒక్క ఛార్జ్ చేస్తే ఏకంగా 17.5 గంటలు పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ వేడెక్కకుండా వీసీ కూలింగ్ టెక్నాలజీని అందించారు.





























