Lava Blaze Pro 5G: లావా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 15వేలకే సూపర్ ఫీచర్స్
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంతో ముందు వరుసలో ఉండే ఈ సంస్థ మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. గతేడాది 5జీ మొబైల్‌ను తీసుకొచ్చిన లావా, తాజాగా ఈ ఫోన్‌కు కొనసాగింపుగా లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..