- Telugu News Photo Gallery Technology photos Redmi note 13 series Launch date in india, Have a look on features and price details
Redmi Note 13: ఎట్టకేలకు లాంచింగ్‌కు సిద్ధమైన రెడ్‌మీ నోట్ 13 సిరీస్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ ఫోన్‌లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనాకు చెందిన ఈ కంపెనీ నుంచి ఫోన్ వస్తుందంటే మార్కెట్లో సందడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రెడ్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, 13 ప్రో+ పేరుతో మూడు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 15, 2023 | 4:17 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి 13 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13+ పేరుతో మూడు ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు.

ఈనెల 21వ తేదీన రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేయనున్నారు. అయితే భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ధర విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 13ప్రో+ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన సామ్‌సంగ్ ఐఎస్‌ఓసెల్ హెచ్‌పీ3 డిస్కవరీ ఎడిషన్ సెన్సర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడి ఓలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్ 5020 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. అలాగే రెడ్‌మీ నోట్ 13 ప్రో+ స్మార్ట్ ఫోన్‌లో 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.





























