AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CNG Cars: ఎలక్ట్రిక్‌తో పోలిస్తే సీఎన్‌జీ కార్లకి పెరుగుతున్న డిమాండ్‌.. కారణం ఏంటంటే..?

CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ వాహనాలలో కూడా కొన్ని ప్రాథమిక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో చాలామంది సీఎన్‌జీ కార్లపై మొగ్గుచూపుతున్నారు.

CNG Cars: ఎలక్ట్రిక్‌తో పోలిస్తే సీఎన్‌జీ కార్లకి పెరుగుతున్న డిమాండ్‌.. కారణం ఏంటంటే..?
Cng Cars
uppula Raju
|

Updated on: May 29, 2022 | 12:14 PM

Share

CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ వాహనాలలో కూడా కొన్ని ప్రాథమిక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో చాలామంది సీఎన్‌జీ కార్లపై మొగ్గుచూపుతున్నారు. ఏప్రిల్ నెలలో సీఎన్‌జీ వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు రెండింతలు పెరిగాయి. అంతేకాదు సీఎన్‌జీ కారు మెయింటనెన్స్‌ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ పెట్రోల్ ధర రూ.105 నుంచి 110 మధ్య ఉంది. సీఎన్‌జీ కారు కిలోమీటరుకు రూ.2.1 ఖర్చవుతుండగా పెట్రోల్ కారు ఖర్చు 5 రూపాయలకు చేరువలో ఉంది. దీనివల్ల సీఎన్‌జీ కార్లకి డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. మారుతి సుజుకి కంపెనీ వ్యాగన్ ఆర్, ఈకో, డిజైర్ వంటి సీఎన్‌జి ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలకి డిమాండ్ విపరీతంగా ఉంది.

వచ్చే 3 నంచి 5 ఏళ్లలో మొత్తం విక్రయాల్లో సీఎన్‌జీ కార్ల వాటా దాదాపు 20 శాతానికి చేరుకోవచ్చని టాటా మోటార్స్ అంచనా వేసింది. అంతేకాదు తన సీఎన్‌జీ మోడల్‌ హ్యాచ్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్‌ని విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇండియా ప్రారంభ స్థాయిలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే దేశంలో కొత్త సిఎన్‌జి స్టేషన్లను ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గత రెండేళ్లలో దేశంలోని 250 నగరాల్లో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య రెండింతలు పెరిగి 3800కి చేరుకుంది. వచ్చే రెండేళ్లలో దేశంలోని 300 నగరాల్లో దాదాపు 10,000 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టాప్-5 మోడల్ గురించి మాట్లాడితే.. మారుతి సుజుకి 10037 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లని విక్రయించింది. మారుతికి చెందిన ఈకో 4084 యూనిట్లు, మారుతీకి చెందిన డిజైర్ 2967 యూనిట్లు, హ్యుందాయ్ ఆరా 2466 యూనిట్లు, టాటా టియాగో 2451 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..