Tata Electric Car: మీరు టాటా ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే వెయిటింగ్ పీరియడ్ తెలుసుకోవాల్సిందే..!
Tata Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ అగ్రగామి సంస్థ. టాటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో Nexon EV, Nexon Max, Tigor EV, XpresT వంటి వాహనాలు ఉన్నాయి. మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే
Tata Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ అగ్రగామి సంస్థ. టాటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో Nexon EV, Nexon Max, Tigor EV, XpresT వంటి వాహనాలు ఉన్నాయి. మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకోవడం మంచిది. వివిధ టాటా ఎలక్ట్రిక్ కార్లపై 4 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. వాటిలో నెక్సన్ EV కారు అత్యధిక డిమాండ్ కలిగి ఉంది. టాటా కంటే ముందు మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ప్రారంభమైంది. వాటిలో E2o, E2o ప్లస్, eVerito వంటి మోడళ్లను ప్రవేశపెట్టింది. అయితే ఇవి మార్కెట్లో ఫ్లాప్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. కానీ టాటా ఒక ప్రణాళికతో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. అందులో టాటా నెక్సాన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. రష్ లేన్ నివేదిక ప్రకారం.. మీరు టాటా కారును బుక్ చేసుకుంటే మీరు దానిని ఇంటికి తీసుకువచ్చే వరకు ఎంతకాలం వేచి ఉండాలో తెలుసుకోండి.
1. నెక్సన్ EV
టాటా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ EV ఇది 90 నుంచి 120 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. EV అనేది టాటా నెక్సాన్ పాత మోడల్. దీని తర్వాత కంపెనీ తన అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ప్రారంభించింది.
2. Nexon EV మాక్స్
ఇది టాటా నెక్సాన్ EV అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌పై రూపొందించారు. ఇందులో కంపెనీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. దీంతో దీని రేంజ్ కూడా పెరిగింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కారు డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. మీరు మ్యాక్స్‌ను బుక్ చేసుకుంటే 90 నుంచి 120 రోజుల వరకు వేచి ఉండాలి.
3. టిగోర్ EV
మీరు టాటా టిగోర్ EVని బుక్ చేసుకుంటే మీరు దీని కోసం 45 నుంచి 60 రోజుల వరకు వేచి ఉండవలసి ఉంటుంది. టాటా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కార్లలో టిగోర్ ఒకటి. ఇంధనం, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ఆప్షన్‌లలో లభించే ఏకైక కారు ఇదే.
4. XpressT
టాటా XpresT ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కారు. ఇందులో కంపెనీ ఎన్నో గొప్ప ఫీచర్లను అందించింది. ఈ కారు రెండు విభిన్న మోడళ్లలో అందుబాటులో ఉంది. ఒక XpresT 165, ఒక XpresT 213 ఉన్నాయి. ఈ రెండు విభిన్న శ్రేణి కార్లు. మీరు ఈ కారును బుక్ చేసుకుంటే 60 నుంచి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి