LG Rollable TV: ఎల్జీ నుంచి అధునాతన స్మార్ట్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే దిమ్మ దిగరాల్సిందే..
LG Rollable TV: టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా ఒకరికి మంచిన ప్రొడక్ట్‌ను...
LG Rollable TV: టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా ఒకరికి మంచిన ప్రొడక్ట్‌ను మరొకరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన ఎల్జీ సరికొత్త టీవీని లాంచ్ చేసింది. రోలబుల్ పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ ప్రత్యేకత తెలిస్తే అవాక్కవాల్సిందే.
సాధారణంగా ఈ టీవీ ఆఫ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ ఒక చిన్న బాక్స్‌లో ఉంటుంది. అదే టీవీ ఆన్ చేయగానే స్క్రీన్ వెంటనే పైకి వస్తుంది. అంతేనా స్క్రీన్ ఎంత వరకు కావాలంటే అంత వరకు ఓపెన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. సెల్ఫ్ లైటింగ్ టెక్నాలజీ దీని మరో ప్రత్యేకత. ఆల్ఫా9 జెన్5 ఏఐ 4కే ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్ 10 ప్రో, హెచ్ఎల్‌జీ, ఏఐ 4కే అప్‌స్కేలింగ్‌లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఎల్జీ వెబ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.
ఇందులో 100W స్పీకర్లను అందించారు. 40W సబ్ఊఫర్లు, 4.2 చానెల్ సెటప్, డాల్బీ అట్మాస్ దీని ప్రత్యేకతలు. టీవీ బరువు ఎంతో తెలుసా? 91 కిలోలు. ఇక ధర విషయానికొస్తే భారత్‌లో రూ. 75 లక్షలుగా ఉంది. ఏంటి షాక్ అవుతున్నారా.? మరి ఇందులో ఉన్న ఫీచర్లు అలాంటివి. ప్రస్తుతం ఎల్‌జీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ టీవీ అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..