Huawei Pura 70: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. లుక్స్‌తో పాటు ఫీచర్స్‌ కూడా

హువావే పురా 70లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో అల్ట్రా మోడల్‌ కెమరాతో గంటకు 300 కి.మీల వేగంతో దూసుకెళ్లే వస్తువును కూడా స్పష్టంగా రికార్డ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కెమెరా విషయానికొస్తే ఇందులో.. 48మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం...

Huawei Pura 70: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. లుక్స్‌తో పాటు ఫీచర్స్‌ కూడా
Huawei Pura 70
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:32 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హువావే మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. హువావే పురా 70 సిరీస్‌తో పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా పురా 70, పురా 70 ప్రో, పురా 70 ప్రో+ మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌ను అదిరే లుక్స్‌తో రూపొందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హువావే పురా 70లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో అల్ట్రా మోడల్‌ కెమరాతో గంటకు 300 కి.మీల వేగంతో దూసుకెళ్లే వస్తువును కూడా స్పష్టంగా రికార్డ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కెమెరా విషయానికొస్తే ఇందులో.. 48మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ కిరిన్ 9010 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం మెలోన్ 910 జీపీయూ సెటప్‌ను అందించారు. దీంతో గేమింగ్‌కు ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. హువావే పురా 70 సిరీస్‌ XMAGE ఇమేజ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఫోన్‌లో ప్రధాన కెమెరా OIS ఫీచర్‌ను అందించారు.

అలాగే ఇందులో ఆక్టా పీడీ ఆటోఫోకస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. 1/1.28-inch అల్ట్రా విజన్ సెన్సార్ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.ఇక ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 2500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా యూడీ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.