AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Head Phones Safety: రోజంతా హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారా? ఇది తెలిస్తే.. షాక్ అవుతారు!

పొద్దున నుంచి రాత్రి వరకూ చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే హెడ్ ఫోన్స్ ను ఇలా మితిమీరి వాడేవాళ్లకు వినికిడి లోపం, చెవి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్ చెప్తున్నాయి. మరి దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Head Phones Safety: రోజంతా హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారా? ఇది తెలిస్తే.. షాక్ అవుతారు!
Headphones Safety
Nikhil
|

Updated on: Sep 22, 2025 | 3:33 PM

Share

ఈ మధ్య కాలంలో వస్తున్న వినికిడి సమస్యలకు హెడ్ ఫోన్స్ వాడకమే ముఖ్యమైన కారణం అని  రిపోర్ట్ లు చెప్తున్నాయి. చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చెవులు పొడిబారి డ్రై గా తయారవుతాయట. దీంతో చెవులు పాడయ్యి రకరకాల సమస్యలు మొదలవుతున్నాయి. అయితే హెడ్ ఫోన్స్ వాడకుండా ఉండలేని వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వటివల్ల కలిగే నష్టాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..

రబ్బర్ బడ్స్ వద్దు

హెడ్ ఫోన్స్ లో రకరకాల డిజైన్ లు ఉంటాయి. వీటిలో అందరకూ ఎక్కువగా వాడే రబ్బర్ బడ్స్.. చెవులకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి చెవులను మూసుకుపోయేలా చేసి, చెవి రంధ్రాలకు గాలి ఆడకుండా చేస్తాయి. అందుకే వీటికి బదులు రబ్బర్ బడ్స్ లేని ఇయర్ ఫోన్స్ ను వాడాలి. వీటి వల్ల కొంత నష్టం తగ్గుతుంది.

ఓవర్ ది ఇయర్

ఎక్కువ సమయం పాటు హెడ్ ఫోన్స్ వాడేవాళ్లు చెవిలోకి దూరిపోయే ఇయర్ బడ్స్‌కు బదులు చెవిని పూర్తిగా కవర్ చేసే ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ వాడితే బెస్ట్. ఇవి చెవి రంధ్రాన్ని కాకుండా చెవి మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఈ తరహా హెడ్ ఫోన్స్ వల్ల చెవులకు పెద్దగా నష్టం ఉండదు.

క్లీన్ చేయాలి

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వాళ్లు వాటిని తరచూ శానిటైజర్‌‌తో క్లీన్ చేస్తుండాలి. హెడ్ ఫోన్స్ పై ఉండే తడి ఎక్కువ బ్యాక్టీరియా క్రిములను ఆకర్షిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఫుల్ వాల్యూమ్ వద్దు

రోజంతా హెడ్ ఫోన్స్ లో ఉండేవాళ్లు ఫుల్ వాల్యూమ్ కాకుండా తక్కువ వాల్యూమ్ తో కాల్స్, మ్యూజిక్ వంటివి వినాలి. ఫుల్ వాల్యూమ్ వల్ల చెవి లోపలి పొరకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. ఇకపోతే చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే.. డాక్టర్ ను కలవడం, ఇయర్ టెస్ట్ చేయించుకోవడం బెటర్.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..