WhatsApp Trick: వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
చాలా మంది వాట్సాప్‌లో కొందరి మెస్సేజులు చదవకూడదని అనుకుంటారు. కానీ అందులోని విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కొంతమంది బ్లూ టిక్ ఆఫ్ చేసుకున్నా.. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అవతలి వ్యక్తికి తెలియకుండా వాట్సాప్ మెస్సేజ్ చదవాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

వాట్సాప్.. మనిషి జీవితంతో పెనవేసుకపోయింది. ఈ యాప్ వచ్చిన నుంచి ముచ్చట్లన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి. వాట్సాప్ లేకుండా ఉండడం చాలా కష్టం. వాట్సాప్ మెసేజ్ చదవినప్పుడు.. మెసేజ్ చదివారని అవతలి వ్యక్తికి బ్లూ టిక్ ద్వారా తెలుస్తుంది. మనకు విషయం తెలియాలి.. కానీ అవతలి వారికి మనం చదివినట్లు తెలియకూడదు అని చాలా మంది అనుకుంటారు. కొంత మంది బ్లూ టిక్ ఆప్షన్ ఆఫ్ చేసుకుంటారు. ఇది కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అయితే అవతలి వారికి తెలియకుండా మెస్సేజ్ చదవాలనుకుంటున్నారా..? ఓ ట్రిక్ ఉపయోగిస్తే మీరు మెస్సేజ్ చదివినట్లు అవతలి వారికి తెలీదు. ఆ ట్రిక్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వాట్సాప్ మెస్సేజ్ చదివినా బ్లూ టిక్ రాకుండా ఉండాలంటే మీ ఫోన్ లో చిన్న సెట్టింట్ చేసుకోవాలి. ఫోన్ హోమ్ స్క్రీన్‌లో వాట్సాప్ యొక్క ప్రత్యేక విడ్జెట్‌ను ఉంచాలి. దీని కోసం, మీ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే.. విడ్జెట్ ఆప్సన్ వస్తుంది. అక్కడ వాట్సాప్‌ను సెలక్ట్ చేసుకుని.. హోమ్ స్క్రీన్‌లో 4 X 2 సైజు విడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి. ఈ విడ్జెట్ గురించి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మీ ఫోన్ హోమ్ స్క్రీన్‌లో మీకు వాట్సాప్ విండోను చూపిస్తుంది. ఈ విండోలో కొత్త మెస్సేజ్‌లను చూసుకోవచ్చు. ఈ విండోలో స్క్రోల్ చేయడం ద్వారా పొడవైన మెస్సేజ్‌లను చదవుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. అవతలి వ్యక్తి విడ్జెట్ ద్వారా చదివిన మెస్సేజ్‌లకు బ్లూ టిక్స్ కనిపించవు. కాబట్టి మీరు ఇంకా మెస్సేజ్ చదవలేరని అవతలి వ్యక్తులు అనుకుంటారు.
కొన్ని ఇబ్బందులు..
ప్రతి ఫీచర్‌తో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి, మీరు ఈ విడ్జెట్‌ను ఉపయోగిస్తే, మీరు రెండు విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. మొదట మీరు ఈ విడ్జెట్ స్క్రోల్ చేస్తూ సందేశాలను చదవాలి. ఒకవేళ మెస్సేజ్‌పై నొక్కితే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. రెండవది ఈ విడ్జెట్ హోమ్ స్క్రీన్‌లో ఉన్నందున.. మీ ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ ఫోన్ హోమ్ స్క్రీన్ చూస్తే.. మీ మెస్సేజ్‌లను ఈజీగా చదవగలరు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.




