Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Account: గూగుల్‌ అకౌంట్లో మీ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలా..? ఇలా చేయండి

Google Account: గూగుల్‌ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. జీమెయిల్‌, వెబ్‌ బ్రౌజింగ్‌, గూగుల్‌ ఫోటో స్టోరేజీ ఇలా ఎన్నో రకాల సేవలు అందుతున్నాయి. అయితే ఈ సేవలన్ని పొందాలంటే..

Google Account: గూగుల్‌ అకౌంట్లో మీ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలా..? ఇలా చేయండి
Follow us
Subhash Goud

|

Updated on: Feb 09, 2022 | 9:10 AM

Google Account: గూగుల్‌ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. జీమెయిల్‌, వెబ్‌ బ్రౌజింగ్‌, గూగుల్‌ ఫోటో స్టోరేజీ ఇలా ఎన్నో రకాల సేవలు అందుతున్నాయి. అయితే ఈ సేవలన్ని పొందాలంటే ముందుగా మనం గూగుల్‌కు కొంత సమాచారం అందించాల్సి ఉంటుంది. మీ పేరు, ప్రొఫైల్‌ ఫోటో, ఇమెయిల్‌ ఐడి, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్‌, ఉద్యోగం, నివసించే ప్రాంతం ఇలా తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాలన్ని ఇతర యూజర్లకు కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు కనిపించకుండా చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీని వల్ల మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు కనిపించవు.

వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలంటే..

ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అందులో మేనెజ్‌ యువర్‌ గూగుల్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంటుంది. ఆ ఆప్షన్‌ ఓపెన్‌ చేస్తే గూగుల్‌ ఖాతా ఓపెన్‌ అవుతుంది. అందులో పర్సనల్‌ మీ ఇన్ఫో సెక్షన్‌పై క్లిక్‌ చేస్తే యూజ్‌ వాట్‌ అథర్స్‌ సీ అనే ఆప్షన్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో అబౌట్‌పై క్లిక్‌ చేస్తే యాడ్‌, ఎడిట్‌, రిమూవ్‌ అనే ఆప్షన్స్‌ కనిపిస్తుంటాయి. మీ ప్రొఫైల్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం అదనంగా నమోదు చేయాలకున్నా, ఉన్న సమాచారాన్ని తొలగించాలన్నా, పేరు మార్పు చేయాలన్నా వాటిపై క్లిక్‌ చేసి మార్పు చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం ఎవ్వరికి కనిపించకుండా ఉండాలంటే Only Me అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా సెట్టింగ్‌లో మార్పులు చేసుకుంటే గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారం ఎవ్వరికి కనిపించకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Jio Calls, Data Free: రిలయన్స్‌ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు ఉచితంగా కాల్స్‌, డేటా

Wisdom Teeth: జ్ఞాన దంతాల వల్ల మనిషి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందా..? పరిశోధకులు ఏమంటున్నారు?