Smartphone: మొబైల్‌ని ఎన్ని సంవత్సరాలు వాడాలి?.. టెక్ ఇంజనీర్లు ఏమంటున్నారంటే..
స్మార్ట్‌ఫోన్‌లు నేడు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం చాలా పని చేస్తోంది. దీని వల్ల మన ఫోన్ లేకుండా ఒకరోజు గడపడం కష్టంగా మారింది. సాంకేతికత చాలా వేగంగా మారుతోంది. కొత్త సిస్టమ్‌లు, పరికరాలను కొనసాగించడం కష్టం కాబట్టి కొన్నిసార్లు, ఈ ఆధారపడటం సమస్య కావచ్చు. అయితే మన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లైఫ్ ఎంత కాలం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
మీరు ఇప్పటి వరకు ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లను మార్చారు..? పాతవాటి గురించి మాట్లాడకుండా.. ప్రస్తుతం మీ చేతిలో లేదా పక్కనే ఉన్న మీ స్మార్ట్‌ఫోన్‌కి ప్రాణం ఎలా ఉందో చెప్పండి..? దానిని ఇంకెంతకాలం ఉపయోగిస్తారు..? దీన్ని ఎన్ని సంవత్సరాలు ఉపయోగించడం మంచిది..? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేకుంటే ఈ వార్త మీకోసమే. ఇవాళ ఈ వ్యాసంలో స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు మార్చాలో మేము మీకు చెప్తాం. దాని జీవిత కాలం ఎంత ఉంటుంది..? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముందు ఉంచనున్నాం.
మన చుట్టు ఉండేవారిలో ప్రతి సంవత్సరం ఫోన్ మార్చే వారు చాలా మంది ఉంటారు.ఒక సంవత్సరం లోపు తమ ఫోన్‌ను మార్చుకునే వారు కూడా కొందరు ఉంటారు. ఇలా చేయడం వెనుక మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్ అప్ గ్రేడెడ్ వర్షన్ కావచ్చు. అయితే ఒక్కసారి ఫోన్ కొని కనీసం రెండు మూడు సంవత్సరాలు వాడే వారు చాలా మంది ఉంటారు. అంతెందుకు స్మార్ట్ ఫోన్ కొన్న తర్వాత చాలా సంవత్సరాలతోపాటు వాడేవారు కూడా ఉంటారు. అయితే స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కోరకమైన అభిప్రాయం ఉంటుంది. అయితే వీటన్నింటి మధ్యలో స్మార్ట్‌ఫోన్ షెల్ఫ్ లైఫ్ ఎంత అనేది చాలా మందికి తెలియదు. మీ స్మార్ట్ ఫోన్ గుంచిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్ఫోన్ సెల్ఫ్ లైఫ్..
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో ఏ కంపెనీకైనా స్మార్ట్‌ఫోన్ సెల్ఫ్ లైఫ్ 9 నెలలు మాత్రమే. బ్రాండెడ్ ఫోన్ల గురించి మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక కంపెనీ ప్రకారం.. అయితే, సాంప్రదాయకంగా స్మార్ట్ఫోన్ సెల్ఫ్ లైఫ్ 18 నెలలు. ఇంతకుముందు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఏటా నడిచేది. ఇప్పుడు మార్కెట్లో పోటీ పెరగడం ప్రారంభమైంది. దీంతో దాని లైఫ్ సర్కిల్ నమ్మదిగా తగ్గింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా లబ్ధి పొందడం ప్రారంభించాయి.
ప్రతి సంవత్సరం స్మార్ట్‌ఫోన్‌ను మార్చడం సరైనదేనా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి సంవత్సరం స్మార్ట్‌ఫోన్‌ను మార్చాల్సిన అవసరం ఉంటే.. అది మంచి ఫోన్‌గా పరిగణించబడదు. స్మార్ట్‌ఫోన్ దాని సెల్ఫ్ లైఫ్ 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే మంచి స్మార్ట్‌ఫోన్ అవుతుంది.
కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో మీకు సరిగ్గా ఏమి అవసరమో విశ్లేషించడం చాలా ముఖ్యం. నిమిషానికి టెక్నాలజీ మారుతున్నప్పటికీ, మీరు స్మార్ట్‌ఫోన్‌ను మునుపటి మోడల్‌తో పోల్చినట్లయితే, పెద్ద మార్పులు ఏమీ ఉండవు. ఫోన్ మొత్తం పరిమాణం, రంగు, లక్షణాలతో పాటు ఫాంట్ సైజులు, స్టైల్స్ వంటి డిజైన్‌లో మార్పులు సాధారణంగా ఉంటాయి. కెమెరా, భద్రతా, నాణ్యత కొద్దిగా మెరుగుపడుతుంది.
మీ ప్రస్తుత ఫోన్ ఐఫోన్ అయినా లేదా ఆండ్రాయిడ్ అయినా మీ అవసరాలను తీరుస్తుంటే.. మీరు కొత్త మోడల్‌ని కొనుగోలు చేయడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. నోట్స్ తయారు చేయడం, చిత్రాలు తీయడం, కాల్ చేయడం, మెసేజ్‌లు పంపడం, నెట్‌లో సర్ఫింగ్ చేయడం, అప్పుడప్పుడు గేమింగ్ చేయడం వంటి ప్రాథమిక అవసరాల కోసం ఫోన్‌ను ఉపయోగించే వ్యక్తి మీరైతే, మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సంవత్సరాల తరబడి ఉపయోగించవచ్చు.
కొత్త స్మార్ట్‌ఫోన్‌కు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలు
- లేటెస్ట్ టెక్నాలజీ
- ఫాస్ట్ ప్రాసెసింగ్ పవర్
- మరిన్ని ఫీచర్లు
కొత్త స్మార్ట్‌ఫోన్‌కు వెళ్లడం వల్ల కలిగే నష్టాలు
- కొత్త హ్యాండ్‌సెట్‌కి డేటా బదిలీ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని
- మీరు మీకు ఇష్టమైన అన్ని యాప్‌లు, గేమ్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.
- మీరు బిజీగా ఉన్న వ్యక్తి.. తగినంత ఖాళీ సమయం లేకపోతే కొత్త హ్యాండ్‌సెట్‌కు అలవాటుపడటం కష్టం అవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టెక్ నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే టెక్ నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని సైన్స్ అండ్ టెక్నికల్ వార్తల కోసం