AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్ బ్యాంక్‌లా పనిచేసే Honor X9e Pro.. మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Honor కొత్త X9e Pro స్మార్ట్‌ఫోన్‌ను మలేషియాలో అధికారికంగా విడుదల చేసింది. భారీ 11,000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు కెమెరా, పనితీరు విషయంలోనూ ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పవర్ బ్యాంక్‌లా పనిచేసే Honor X9e Pro.. మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!
Honor X9e Pro.jpg
Nikhil
|

Updated on: Sep 27, 2026 | 10:31 AM

Share

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ ఎంత ఎక్కువగా ఉంటే అంత సౌకర్యంగా ఉంటుందని భావించే వారికి Honor నుంచి కొత్త మోడల్ వచ్చింది. X9e Proలో ఏకంగా 11,000mAh బ్యాటరీని ఇచ్చారు. దీంతో ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే, 108MP కెమెరా, Snapdragon చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

11,000mAh బ్యాటరీ..

ఈ ఫోన్‌లో 11,000mAh బ్యాటరీని అందించారు. సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీ కారణంగా ఈ స్థాయి సామర్థ్యం సాధ్యమైందని Honor చెబుతోంది. కంపెనీ ల్యాబ్ పరీక్షల ప్రకారం 164 గంటలకు పైగా మ్యూజిక్ స్ట్రీమింగ్, 35 గంటల షార్ట్ వీడియో ప్లేబ్యాక్, 66 గంటలకు పైగా సాధారణ వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చని పేర్కొంది.

రోజుకు సగటున 6 గంటల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరు సంవత్సరాల వరకు బ్యాటరీ ఆరోగ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో ఇతర పరికరాలకు కూడా పవర్ ఇవ్వొచ్చు.

10,000 నిట్స్ డిస్‌ప్లే..

ఈ మోడల్‌లో 6.8 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తాయి. 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మొత్తం స్క్రీన్‌పై నిరంతరం ఉండదు. HDR వీడియో ప్లేబ్యాక్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ స్థాయికి చేరుతుందని కంపెనీ వివరించింది.

కెమెరాల విషయానికి వస్తే ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక 108MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Snapdragon 6 Gen 5 చిప్‌సెట్, 8GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ లభిస్తాయి. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP69K రేటింగ్ ఉంది. 100,000 సార్లు నీటిలో ముంచే పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ చెబుతోంది. సాఫ్ట్‌వేర్‌గా Android 16 ఆధారిత MagicOS 10 ఉంది. Royal Purple, Reddish Brown, Dawn Gold, Midnight Black రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మలేషియాలో 8GB+256GB వేరియంట్ ధర MYR 1,899 (సుమారు $464), 512GB వేరియంట్ ధర MYR 2,399 (సుమారు $587)గా ఉంది.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?