Electric Vehicles: ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలు వేగానికి మారుపేరు.. పెట్రోల్‌ వెహికిల్స్‌కి ఏమాత్రం తీసిపోవు..

ఈవీ వెహికల్స్ స్పీడ్ వెళ్లవని, ఓ నిర్ధిష్ట వేగంలోనే వెళ్తాయనే అపోహ ఉంది. అలాగే ఈవీ బైక్స్ లాంగ్ రైడ్స్ కు పనిరావని అనుకుంటుంటారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువ పట్టణ ప్రాంత ప్రజలే కొనుగోలు చేస్తున్నారు. అయితే గ్రామీణ వినియోగదారులను టార్గెట్ చేస్తూ కంపెనీలు కూడా లాంగ్ రైడ్స్ కు సపోర్ట్ చేస్తూ పెట్రోల్ వాహనాలకు ధీటుగా వెళ్లేలా తమ మోడల్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నాయి.

Electric Vehicles: ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలు వేగానికి మారుపేరు.. పెట్రోల్‌ వెహికిల్స్‌కి ఏమాత్రం తీసిపోవు..
Electric Scooters
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jan 07, 2023 | 4:52 PM

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల హవా నడుస్తుంది. ప్రభుత్వం కూడా ముడి చమురు కొనుగోలు ను తగ్గించుకునే ప్రయత్నంలో ఈవీ వాహనాలను ప్రమోట్ చేస్తుంది. వాటిపై భారీ రాయితీలను ఇస్తూ ప్రోత్సహిస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్ తో వినియోదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈవీ వెహికల్స్ స్పీడ్ వెళ్లవని, ఓ నిర్ధిష్ట వేగంలోనే వెళ్తాయనే అపోహ ఉంది. అలాగే ఈవీ బైక్స్ లాంగ్ రైడ్స్ కు పనిరావని అనుకుంటుంటారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువ పట్టణ ప్రాంత ప్రజలే కొనుగోలు చేస్తున్నారు. అయితే గ్రామీణ వినియోగదారులను టార్గెట్ చేస్తూ కంపెనీలు కూడా లాంగ్ రైడ్స్ కు సపోర్ట్ చేస్తూ పెట్రోల్ వాహనాలకు ధీటుగా వెళ్లేలా తమ మోడల్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నాయి. స్పీడ్ విషయంలో పెట్రోల్ వాహనాలకు పోటినిచ్చే ఈవీ బైక్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

అల్ట్రావైలెట్ ఎఫ్ 77

బెంగుళూరు కేంద్రంగా ఉండే అల్ట్రావైలెట్ అత్యంత మైలేజ్ ను ఇచ్చే ఎఫ్ 77 మోడల్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఒకసారి చార్జి చేస్తే ఏకంగా 307 కిలోమీటర్ల మైలేజ్ ను ఎఫ్ 77 అందించేలా 10.3 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఈ బైక్ కు అమర్చారు. అలాగే ఈ బైక్ గంటకు 147 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. 

ఇవోమి ఎస్ 1

పూనే కేంద్రంగా ఉన్న ఇవోమి కంపెనీ తన ఎస్ 1 మోడల్ లో తీసి పెట్టుకునే విధంగా రెండు 4.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీలను అందిస్తుంది. అందువల్ల ఈ బైక్ ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 240 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అలాగే బ్యాటరీలకు కూడా మూడెళ్ల వారంటీ కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొమాకి రేంజర్

ఈ బైక్ కూడా 3.6 కె డబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే క్రూజర్ బైక్. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 220 కిలోమీటర్ల వరకూ వెళ్తుంది. ఫాక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ తో వచ్చే ఈ బైక్ ధర 1.84 లక్షలు. ఈ ధరను పెట్టుకుని కొనాలనుకునే వారికి ఈ బైక్ ఉత్తమ ఎంపిక.

ఒబెన్ రోర్

ఈ బైక్ ఓ సారి చార్జి చేస్తే గంటకు 200 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ ప్రకటించిన వాస్తవ పరిస్థితుల్లో 150 కిలోమీటర్ల రేంజ్ ను మాత్రమే సాధించింది. 4.4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ బైక్ కేవలం కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఓలా ఎస్ 1 ప్రో

ఓలా ఎస్ 1 ప్రో 4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ కూడా 182 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రకటించినా వాస్తవంగా 102 కిలోమీటర్ల రేంజ్ లోనే ఉంటుంది. అయితే సాధారణ మోడ్ లో ఉంటే మాత్రం 127 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..