Glass Mouse Pad: గాజుతో చేసిన మౌస్‌ ప్యాడ్‌ చూశారా? లుక్‌ ఎంత బావుందో కదా? ధర తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..

సాధారణ మౌస్‌ ప్యాడ్‌ ను సిలికాన్‌ లేదా రబ్బరుతో తయారు చేస్తారు. అయితే గాజుతో తయారు చేసిన మౌస్‌ ప్యాడ్‌ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Glass Mouse Pad: గాజుతో చేసిన మౌస్‌ ప్యాడ్‌ చూశారా? లుక్‌ ఎంత బావుందో కదా? ధర తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..
Glass Mouse Pad
Follow us
Madhu

|

Updated on: Mar 23, 2023 | 11:00 AM

కంప్యూటర్‌ వినియోగించే వారందరికీ మౌస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి మౌస్‌ కి దాని కింద ఓ ప్యాడ్‌ కూడా ఉంటుంది. ఇది మౌస్‌ ఎటుబడితే అటు వెళ్లిపోకుండా స్థిరంగా ఉండేందుకు సాయపడుతుంది. సాధారణ ఈ మౌస్‌ ప్యాడ్‌ సిలికాన్‌ లేదా రబ్బరుతో తయారు చేస్తారు. అయితే గాజుతో తయారు చేసిన మౌస్‌ ప్యాడ్‌ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. ఇది పర్సనల్ కంప్యూటర్ వినియోగించే వారికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రేజర్‌ అట్లాస్‌ పేరుతో..

హార్డ్‌ వేర్‌, సాఫ్ట్‌ వేర్‌ సేవల ప్రపంచంలో అతి పెద్ద గేమర్‌ ఫోకస్డ్ ఎకోసిస్టమ్‌ను రూపొందించిన గ్లోబల్ గేమింగ్, ఎస్పోర్ట్స్ కమ్యూనిటీ ఈ గ్లాస్‌ మౌస్‌ ప్యాడ్‌ లను ఆవిష్కరించింది. ఈ కంపెనీ నుంచి మొదటి గ్లాస్‌ మౌస్‌ ప్యాడ్‌ ఇది. మంచి నాణ్యతతో పాటు మన్నికగా ఉంటుందని, ప్యూర్‌ గా కనిపిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. దీని ధర 99.99 డాలర్లుగా ఉంది. అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపు రూ. 8,265 ఉంటుంది.

దేనితో తయారు చేశారు..

రేజర్‌ అట్లాస్‌ మౌస్‌ ప్యాడ్‌ ను టెంపర్డ్‌ గ్లాస్‌ తో తయారు చేశారు. ఇది యాంటీ-స్లిప్ రబ్బర్ బేస్‌తో వస్తుంది. ఇది నలుపు లేదా తెలుపు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. 0.19 అంగుళాలు (5 మిల్లీమీటర్లు) మందంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సున్నితంగా.. వేగంగా..

గ్లాస్ మౌస్ ప్యాడ్ తయారీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర మౌస్‌లతో పోల్చితే వినియోగదారుని మౌస్‌ని మునుపెన్నడూ లేనంత వేగంగా గ్లైడ్ చేయనివ్వాలనేది లక్ష్యం. అయితే గ్లాస్ మౌస్‌ప్యాడ్‌తో వినియోగదారుడు వేసవి సమయంలో మౌస్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. మౌస్‌ప్యాడ్‌ను ఉపయోగించడంలో చెమట ఇబ్బందిని సృష్టించవచ్చు. చేతిలో నుంచి జారిపోయే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..