- Telugu News Photo Gallery Technology photos Realme launching new 5g smartphone Realme c55 features and price details
Realme C55: భారతమార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్.. రూ. 11 వేలలో 64 ఎంపీ కెమెరా.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 23, 2023 | 10:33 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు.

రియల్‌మీ సీ55 స్మార్ట్ ఫోన్‌లో ఫుల్ హెచ్‌డీ+తో కూడడిన 6.72 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను వేరియంట్స్‌లో లాంచ్ చేశారు.

4GB, 6GB, 8GB RAM ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యింది. 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఇందులో అందించారు. అలానే 1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కి సపోర్ట్ చేసే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఆఫర్ చేశారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

మార్చి 28వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఇక ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 6GB RAM+64GB వేరియంట్ ధర రూ. 11,999 కాగా 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వచ్చే టాప్-ఎండ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది.





























