శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ(Samsung Galaxy F23 5G).. మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. అది కూడా కేవలం రూ. 20వేల లోపు ధరలోనే. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉంది. ఇది 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లో ఉన్న ఈ మొబైల్ అమెజాన్ లో కేవలం రూ. 15,990కే లభిస్తోంది.