Women’s Day gift: మీ ఇంట్లో మహిళలకు ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి.. ఫిదా అయిపోతారు.. ఉమెన్స్ డేకి బెస్ట్ ఆప్షన్స్  

ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు స్మార్ట్‌వాచ్ వంటి టెక్ గాడ్జెట్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో స్త్రీ ఆరోగ్యాన్ని కూడా స్మార్ట్ వాచ్‌లో సులభంగా ట్రాక్ చేయవచ్చు. కాబట్టి ఈ పరికరం మహిళలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Women's Day gift: మీ ఇంట్లో మహిళలకు ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి.. ఫిదా అయిపోతారు.. ఉమెన్స్ డేకి బెస్ట్ ఆప్షన్స్  
Noise Fit Halo
Follow us
Madhu

|

Updated on: Mar 08, 2023 | 10:38 AM

మహిళల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించేందుకు అనువైన సమయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఏటా మార్చి ఎనిమిదో తేదీన దీనిని నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని వివిధ రకాలుగా జరుపుకుంటారు. మీరు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో మీ తల్లి, సోదరీమణులు, భార్య లేదా స్నేహితురాలికి బెస్ట్ విషెస్ చెప్పడానికి, వారిని సర్ ప్రైజ్ చేయడానికి ఓ మంచి బహుమతిని ఇవ్వ వచ్చు. ఒక వేళ మీరు ఇలాంటి ఆలోచనలోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు స్మార్ట్‌వాచ్ వంటి టెక్ గాడ్జెట్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో స్త్రీ ఆరోగ్యాన్ని కూడా స్మార్ట్ వాచ్‌లో సులభంగా ట్రాక్ చేయవచ్చు. కాబట్టి ఈ పరికరం మహిళలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంతో పాటు, ఇతర క్రీడా కార్యకలాపాలను కూడా ట్రాక్ చేయవచ్చు. అంటే ఈ మహిళా దినోత్సవం వారి ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ డే రోజున గిఫ్ట్ ఇవ్వదగిన ఐదు అత్యుత్తమ స్మార్ట్‌వాచ్‌ల గురించి తెలుసుకుందాం..

ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్(Ambrane wise eon max)

ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ లో 2.01 అంగుళాల ల్యూసిడ్ డిస్ ప్లే ఉంటుంది. 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 60Hz ల రిఫ్రెష్ మెంట్ రేట్ తో పాటు 240*283 రిజల్యూషన్ ఉంటుంది. ఇది 100 ప్లస్ క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. దీనిలో వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, ఎస్పీఓ2 ట్రాకింగ్, ఐపీ68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. దీని ధర రూ. 2799 గా ఉంటుంది.

ఫిట్ షాట్ ఆస్టర్(Fitshot Aster)

ఫిట్ షాట్ ఆస్టర్ స్మార్ట్ వాచ్ లో 1.43 అంగుళాల రౌండ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 1000 నిట్ల పీక్ బ్రైట్ నెస్, 466*466 పిక్సల్స్ తో కూడిన రిజల్యూషన్ ఉంటుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. దీనిలో బిల్ట్ ఇన్ స్పీకర్ మైక్రో ఫోన్, ఫాస్ట్ డైలర్ ఫోన్ కాల్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. హెల్త్ ట్రాకింగ్ సంబంధించిన ఫీచర్లు హార్ట్ రేట్, ఎస్పీఓ2, బ్లడ్ ప్రెజర్, రుతుచక్రం, స్లీప్ మోనిటరఱ్, బ్రీత్ ట్రైనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫిట్ షాట్ ఆస్టర్ లో ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ. 3299గా ఉంది.

ఇవి కూడా చదవండి

గిజ్మోర్ క్లౌడ్(gizmore cloud)

గిజ్మోర్ క్లౌడ్ స్మార్ట్ వాచ్ మెటాలిక్ కేసింగ్ తో వస్తుంది. దీనిలో 1.85 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ కర్వడ్ డిస్ ప్లే ఉంటుంది. 500 నిట్ల పీక్ బ్రైట్ నెస్ ఇస్తుంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. దీనిలో అన్ లిమిటెడ్ క్లౌడ్ వాచ్ ఫేసెస్, కాలిక్యూలేటర్ యాప్, అలాగే హార్ట్ రేట్ మానిటర్, మహిళా హెల్త్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఎస్పీఓ2 మానటరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఐపీ67 రేటింగ్ లో వాటర్ రెసిస్టంట్ గా ఈ ఫోన్ పనిచేస్తుంది. దీని ధర రూ. 1499 గా ఉంది.

మాక్సిమా మ్యాక్స్ ప్రో స్కై(Maxima max pro sky)

మాక్సిమా మ్యాక్స్ ప్రో స్కై స్మార్ట్ వాచ్ లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిలో పాస్ వర్డ్ తో కూడిన స్క్రీన్ లాక్ ఆప్షన్ ఉంది. ఇందుకోసం వ్యక్తిగతమైన క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 240*280 పిక్సల్స్ రిజల్యూషన్ తో ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. దీనిలో అడ్వాన్స్ డ్ కాలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే హార్ట్ రేట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2 స్లీప్ అండ్ స్ట్రెస్ మోనిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కూడా ఐపీ67 రేటింగ్ తో డస్ట్, చమట, నీటి రెసిస్టంట్ గా పనిచేస్తుంది. దీని ధర రూ. 1799 గా ఉంది.

నాయిస్ పిట్ హలో(Noise fit halo)..

నాయిస్ ఫిట్ హలో స్మార్ట్ వాచ్ లో 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 466*466 పిక్సల్స్ రిజల్యూషన్ తో ఇది వస్తుంది. దీనిలో రీసెంట్ కాల్ లాగ్స్ 10 వరకూ స్టోర్ అవుతాయి. అందుకోసం దీనిలో నాయిస్ బజ్ అనే ఫీచర్ ఉంటుంది. హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2, స్లీప్ మానిటర్, స్ట్రెస్ మోనిటర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిలో 100 వరకూ స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఇది కూడా ఐపీ68 రేటింగ్ తో వాటర్ రెసిస్టంట్ తో వస్తుంది. దీని ధర 3999 గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..