AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: చరిత్రలో తొలిసారి.. మరో అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. ఉపగ్రహం కూల్చివేత సక్సెస్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. ఇదివరకెప్పుడు చేయని ఓ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వరుస ఉపగ్రహ ప్రయోగాలతో రికార్డులు సృష్టిస్తున్న ఇస్రో తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది.

ISRO: చరిత్రలో తొలిసారి.. మరో అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. ఉపగ్రహం కూల్చివేత సక్సెస్..
Isro
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2023 | 7:52 AM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. ఇదివరకెప్పుడు చేయని ఓ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వరుస ఉపగ్రహ ప్రయోగాలతో రికార్డులు సృష్టిస్తున్న ఇస్రో తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. జీవితకాలం ముగిసిన ఓ ఉపగ్రహాన్ని విజయవంతంగా సముద్రంలో కూల్చేసింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను అంతరిక్షంలోనే పేల్చివేసే సామర్థ్యం ఇస్రోకు ఉన్నప్పటికీ.. అక్కడ పేల్చి వేస్తే ఆ శాటిలైట్ అవశేషాలు భవిష్యత్తులో ముప్పుగా మారతాయన్న బాధ్యతతో ఓ కాలం చెల్లిన ఉపగ్రహాన్ని భూకక్ష్యలోనికి తీసుకొచ్చి, సముద్రంలో కూలేలా చేసింది. ఈ తరహా ప్రయోగం జరపడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ఈ సంస్థ మరో ఘనత సాధించినట్లయ్యింది. 2011లో ప్రయోగించిన వెయ్యి కిలోల మేఘా ట్రాపికే-1 జీవితకాలం ముగియడంతో దాన్ని నియంత్రిత విధానంలో కూల్చేవేశారు. అయితే ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతం గుండా శాటిలైట్‌ను భూవాతావరణంలోకి ప్రవేశించేలా ఇస్రో చర్యలు తీసుకుంది. ఉష్ణమండల వాతావరణ, పర్యావరణంపై అధ్యయనానికి దీనిని వాడారు.

ఇటీవల కాలంలో చైనా ఉపగ్రహ శకలాలు ప్రపంచాన్నివణికించడంతో … భారత్‌ అప్రమత్తమైంది. కాలం చెల్లిన తన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై ఇస్రో కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. కానీ, అలా చేస్తే వాటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారతాయి.

మేఘ-ట్రోపికస్‌-1 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగానికి ఎంచుకుంది. దీనిని 2011 అక్టోబర్‌ 12న ఫ్రాన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ సీఎన్‌ఈసీ కలిసి సంయుక్తంగా ప్రయోగించాయి. ఉష్ణమండల వాతావరణ, పర్యావరణంపై అధ్యయనానికి దీనిని వాడాయి. వాస్తవానికి మూడేళ్లు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేస్తుందని తొలుత అంచనావేశారు. కానీ, ఇది 2021 వరకు నిరంతరాయంగా సేవలు అందించింది. ఈ ఉపగ్రహంలోని కాలం చెల్లిన పరికరాల పనితీరు ఏమాత్రం బాగోలేదు. నియంత్రణ సరిగా లేకపోతే ఉప్రగ్రహంలో వాడే విషపూరిత పదార్థాలు, రేడియోయాక్టివ్‌ ఐసోటోప్‌లు, రసాయనాల నుంచి ముప్పు ఉండవచ్చు. దీంతో దీనిని సముద్రంలో కూల్చివేయనున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలోని నిర్జన ప్రదేశంలో ఇది పడేలా మార్గాన్ని నిర్దేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..