Reliance Jio: రోజుకు 2.5జీబీ డేటాను అందించే బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. నెలనెలా రీచార్జ్ చేసుకునే బాధ ఇక ఉండదు..

ప్రస్తుత సమాజంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. అందుకే అందరూ ఎక్కువ డేటాతో కూడిన బ్రాండ్ బ్యాండ్ ప్యాక్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే బ్రాంబ్ బ్యాండ్ అందుబాటులోని లేని వారి కోసం రిలయన్స్ రోజూ 2.5జీబీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలు అందించే ప్లాన్లు ప్రవేశపెట్టింది.

Reliance Jio: రోజుకు 2.5జీబీ డేటాను అందించే బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. నెలనెలా రీచార్జ్ చేసుకునే బాధ ఇక ఉండదు..
Jio
Follow us
Madhu

|

Updated on: May 01, 2023 | 2:30 PM

మన దేశంలోని టెలికాం రంగంలో ఓ సంచలనం రిలయన్స్ జియో. ఇంటర్ నెట్ ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సరసమైన ధరల్లోనే హై స్పీడ్ ఇంటర్ నెట్ అందించి అందరి మన్ననలు పొందింది. రోజూవారీ డేటా ప్లాన్లను తీసుకొచ్చి ప్రజలను ఆకర్షించింది. రోజు 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 2.5జీబీ అంటూ వివిధ ప్యాక్ లను అందిస్తోంది. వినియోగదారులు, ఎవరి అవసరాన్ని బట్టి వారు ప్రీపెయిడ్ ప్యాక్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ 1జీబీ, 2జీబీలు సరిపోవడం లేదు. అందుకే అందరూ ఎక్కువ డేటాతో కూడిన బ్రాండ్ బ్యాండ్ ప్యాక్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే బ్రాంబ్ బ్యాండ్ అందుబాటులోని లేని వారి కోసం రిలయన్స్ రోజు 2.5జీబీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలు అందించే ప్లాన్లు అందిస్తోంది. వాటి టారిఫ్, ఇతర ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రిలయన్స్ జియో రూ. 2,999 ప్లాన్..

రూ. 2999 ప్లాన్ అనేది చాలా ప్రయోజనాలను అందించే దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 365 రోజులు + 23 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ లో రోజుకు 2.5జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అదనంగా 75జీబీ బోనస్ డేటాను అందిస్తుంది. వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

రిలయన్స్ జియో రూ. 2,023 ప్లాన్..

ఇది మరొక దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్, ఇది 252 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2.5జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ ఫీచర్లు ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

రిలయన్స్ జియో రూ. 899 ప్లాన్..

ఈ ప్లాన్ మిడ్-రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రోజుకు 2.5జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ యాప్ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

రిలయన్స్ జియో రూ. 349 ప్లాన్..

ఇది ప్లాన్ స్వల్పకాలిక ప్రీపెయిడ్ ప్లాన్, ఇది రోజుకు 2.5జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంస్ లను అందిస్తుంది. ఇది 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిలో కూడా వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి ఫీచర్లను ఉచితంగా యాక్సెస్ చేసే వీలుంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..