Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ కాల్స్, మెస్‌జ్‌లకు చెక్.. మే 1 నుంచే అమలు..!

TRAI New Rules: ఇండియాస్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మే 1 నుంచి ఫోన్ కాలింగ్, మెసేజింగ్ సేవల నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. ఫ్రాడ్ కాల్స్‌, మెసేజ్‌లకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నందునే ట్రాయ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు..

TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ కాల్స్, మెస్‌జ్‌లకు చెక్.. మే 1 నుంచే అమలు..!
Ai Feature To Avoid Fake Calls And Messages
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 30, 2023 | 8:51 PM

TRAI New Rules: ఇండియాస్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మే 1 నుంచి ఫోన్ కాలింగ్, మెసేజింగ్ సేవల నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. ఫ్రాడ్ కాల్స్‌, మెసేజ్‌లకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నందునే ట్రాయ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం ట్రాయ్ ఫ్రాడ్ కాల్స్, మెసేజ్‌లను నిలిపివేసేందుకు ఓ ప్రత్యేకమైన ఫిల్టర్‌ను సెటప్ చేయనుంది. ఫలితంగా మొబైల్ సేవల వినియోగదారులు గుర్తు తెలియని కాల్స్, మెసేజ్‌ల నుంచి ఉపశమనం పొందనున్నారు. ఎలా అంటే ట్రాయ్ ఈ విషయంపై టెలికాం కంపెనీలకు వారి ఫోన్ కాల్స్, మెసేజ్ సర్వీస్‌లలో ఏఐ స్పామ్ ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ మోసాల నుంచి టెలికాం సేవల వినియోగదారులను రక్షించడంలో ఈ ఫిల్టర్ సహాయపడుతుందని పేర్కొంది.  ఈ కొత్త రూల్ ప్రకారం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అన్ని టెలికాం కంపెనీలు మే 1, 2023లోపు ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రాయ్ తాజా నిబంధనల కంటే మునుపే ఎయిర్‌టెల్ ఇప్పటికే ఇటువంటి AI ఫిల్టర్ల సదుపాయాన్ని ప్రకటించింది. ఈ కొత్త రూల్ నేపథ్యంలో జియో తన సర్వీస్‌లలో AI ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధమవుతుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం దీని గురించి పెద్దగా సమాచారం లేదు. కానీ భారతదేశంలో AI ఫిల్టర్‌ల అప్లికేషన్ మే 1, 2023 నుంచి ప్రారంభమవుతుందని టెలికాం వర్గాలు అంటున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి