Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget smart phone: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. వెంటనే బుక్ చేయండి..

మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కూడా రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు బడ్జెట్ లో ఉండాలని భావిస్తుంటే మీ కోసమే ఈ కథనం.. రూ.20 వేల లోపు విలువ గ‌ల బెస్ట్ స్మార్ట్ ఫోన్లేవో ఓ లుక్కేద్దాం రండి..

Budget smart phone: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. వెంటనే బుక్ చేయండి..
Smartphones
Follow us
Madhu

|

Updated on: Feb 28, 2023 | 9:07 AM

స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరికీ ఓ నిత్యావసరం. ఎక్కడకు వెళ్లాలన్నా అది ఉండి తీరాల్సిందే. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం సమాచార మార్పిడికి మాత్రమే ఉపయోగపడేది. అయితే ఇప్పుడు అది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటోంది. దీంతో దానికి ప్రాధాన్యత పెరిగింది. మార్కెట్లో వందల కొద్దీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ ఏది అంటే చెప్పడం కష్టం. ఆయా వ్యక్తుల ప్రాధాన్యాలు, అవసరాలు, బడ్జెట్ వంటి అంశాలను బట్టి ఇది మారుతుంటుంది. అయితే ఫోన్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కూడా రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు బడ్జెట్ లో ఉండాలని భావిస్తుంటే మీ కోసమే ఈ కథనం.. రూ.20 వేల లోపు విలువ గ‌ల బెస్ట్ స్మార్ట్ ఫోన్లేవో ఓ లుక్కేద్దాం రండి..

రియల్ మీ 10 ప్రో 5జీ (realme 10 Pro 5G)..

మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తన్నట్లయితే రియల్ మీ 10 ప్రో 5జీ మంచి ఎంపిక. దీనిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెచ్జెడ్ బౌండ్‌లెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 16ఎంపీసెల్ఫీ కెమెరాతో 108ఎంపీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది నెబ్యులా బ్లూ, హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్‌ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 6జీబీ+128జీబీ ధర రూ. 18,999 8జీబీ+ 128జీబీ ధర రూ.19,999. రియల్ మీ అధికారిక వైబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

పోకో ఎక్స్ ఎక్స్4 5జీ(POCO X4 Pro 5G)..

పొకో ఎక్స్4 ప్రో ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంటాయి. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా గ్లాస్‌తో క‌వ‌ర్ చేసి ఉంటుంది. గ‌త ఏప్రిల్ ఐదో తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. పొకో ఎక్స్‌4 ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్ ఉంటుంది. దీని డిస్‌ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. 64 ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామ‌ర్థ్యం గ‌ల మూడు కెమెరాలు ఫోన్ బ్యాక్‌లోనూ, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్‌లో మ‌రో కెమెరా ఉంటుంది. దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5000 ఎంఏహెచ్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ సామ‌ర్థ్యం ఉంటుంది. దీని ధ‌ర రూ.16,999. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రరూ. 18,999ల కు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

వ‌న్‌ప్ల‌స్ నొర్డ్ సీఈ 2 లైట్ 5జీ(OnePlus Nord CE 2 Lite 5G)..

రూ.20 వేల లోపు క్యాట‌గిరీలో వ‌న్‌ప్ల‌స్ తీసుకొస్తున్న తొలి స్మార్ట్ ఫోన్‌. 64 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమ‌రా, రెండు 2-ఎంపీ సెన్స‌ర్ కెమెరాలు ఉంటాయి. ఇన్‌ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌, ఓక్టాకోర్ సీపీయూ (2.2గిగా హెర్ట్జ్, డ్యుయ‌ల్ కోర్‌), 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ చార్జ‌ర్ ల‌భిస్తుంది. 6జీబీ /128జీబీ, 8జీబీ/128జీబీ వేరియంట్ల‌లో ల‌భించే ఈ ఫోన్ ధ‌రలు రూ.18999, రూ. 20,999. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ(Redmi Note 12 5G)..

రెడ్ మీ నోట్ 12 5జీ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో వస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ సెట్ తో వస్తుంది. 6.67 ఫుల్ హెచ్ డీ, సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది. 48ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇది ఫ్రాస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తోంది. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో రెడ్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ ధర రూ.17,999, 6జీబీ+128జీబీ ధర రూ.19,999 గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..