Hammer Smart Watches: మరో రెండు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేసిన హామర్… ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారంతే..!
వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ రావడంతో ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌లను తయారు చేసే కంపెనీలు మార్కెట్‌లోకి దూసుకొచ్చాయి. తక్కువ ధరలకే అధునాత ఫీచర్ల స్మార్ట్‌వాచ్‌లను అందిస్తుండడంతో వినియోగదారులు వీటి కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌ల రంగంలో తనదైన ప్రత్యేక శైలి కనబరుస్తున్న హామర్ కంపెనీల ఇటీవల రెండు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేసింది.
భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను అధికంగా వాడుతున్నారు. గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే వాడే వాచ్‌లు ప్రస్తుతం సూపర్ స్మార్ట్‌గా రావడంతో వాటిని ధరించేందుకు యువత మక్కువ చూపుతున్నారు. కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా నోటిఫికేషన్లను తనిఖీ చేయడం, ఫోన్స్ కాల్స్ ఆన్సర్ చేయడంతో పాటు ఆరోగ్య భద్రతకు సంబంధించిన సూచనలు ఇస్తుండడంతో యువతతో పాటు మధ్య వయస్కులు స్మార్ట్ వాచ్‌ల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అయితే వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ రావడంతో ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌లను తయారు చేసే కంపెనీలు మార్కెట్‌లోకి దూసుకొచ్చాయి. తక్కువ ధరలకే అధునాత ఫీచర్ల స్మార్ట్‌వాచ్‌లను అందిస్తుండడంతో వినియోగదారులు వీటి కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌ల రంగంలో తనదైన ప్రత్యేక శైలి కనబరుస్తున్న హామర్ కంపెనీల ఇటీవల రెండు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేసింది. మధ్యతరగతి ప్రజలే అసలైన టార్గెట్‌గా తక్కువ ధరకే ఆయా స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులో ఉంచుతుంది. హామర్ యాక్టివ్ 2.0, హామర్ సైక్లోన్ అనే పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌ల ధర ఫీచర్ల వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
హామర్ యాక్టివ్ 2.0
హామర్ 2.0 స్మార్ట్ వాచ్ 1.92 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మెటాలిక్ బాడీతో పాటు డిటాచబుల్ సిలికాన స్ట్రిప్‌తో వచ్చే ఈ వాచ్ బ్లూటూత్ కనెక్టవిటీతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ వాచ్‌లో 50 కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఐపీ 67తో వచ్చే ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. అలాగే ఇన్ యాప్ జీపీఎస్, వాతావరణ అప్‌డేట్స్, స్టాప్ వాచ్, కాలిక్యులేటర్, క్యాలెండర్, పెడోమీటర్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ సౌలభ్యాన్ని అందిస్తుంది. మాస్ వేర్ యాప్ సపోర్ట్‌తో వచ్చే ఈ వాచ్ ధర రూ.1899గా ఉంది. నిద్ర పర్యవేక్షణ, హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఎస్‌పీఓ2, ఉష్ణోగ్రత, మహిళల రుతుచక్ర ట్రాకింగ్ ఈ వాచ్ ప్రత్యేకతలు. అలాగే ఈ వాచ్‌లో వందకు పైగా వాల్ పేపర్లు, 55 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ వాయిస్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది.
హామర్ సైక్లోన్
ఈ వాచ్ 1.39 అంగుళాల వృత్తాకార డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వాచ్ కూడా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. వాచ్‌కు మరింత మన్నికను అందించే నాలుగు రిమూవబుల్ స్ట్రిప్స్‌తో వస్తుంది. అలాగే బ్లూటూత్ కనెక్టవిటీ, అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఐపీ 67 వల్ల నీటి నిరోధకతతో పాటు వివిధ ట్రాకర్లు ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే 100 ప్లస్‌కు పైగా స్పోర్ట్స్ మోడ్‌తో పాటు 100కు పైగా వాల్‌పేపర్లు ఈ వాచ్ ప్రత్యేకతలు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అన్ని ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ.2399గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..