- Telugu News Photo Gallery Technology photos These are the super phones that come with amazing storage.. away from storage problem..
Smartphones Storage: అద్భుత స్టోరేజ్‌తో వచ్చే సూపర్ ఫోన్లు ఇవే.. ఆ సమస్యకు చెక్..
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే వీటి వినియోగం ఏ స్థాయిలో ఉందో? అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారడంతో వినియోగదారులు ఖర్చుకు వెనుకాడకుండా స్టోరేజ్‌తో పాటు అదనపు ఫీచర్లు ఉన్న ఫోన్ల కొనుగోలు ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని ఫోన్లు స్టోరేజ్ కారణంగా స్లో అయ్యిపోతూ కస్టమర్లను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో కంపెనీలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సూపర్ స్టోరేజ్ వేరియంట్స్‌లో కొత్త మోడల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అదర్భుత స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
Srinu |
Updated on: Jul 20, 2023 | 4:15 PM

ఐక్యూ నియో 6 5జీ ఫోన్ వినియోగదారులకు ఓ విలువైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ ఫోన్ అద్భుత పనితీరుతో ఆకట్టుకోవడమే కాకుండా భారీ స్టోరేజ్‌తో ఆకర్షిస్తుంది. మావెరిక్, ఆరెంజ్, డార్క్‌నోవా, సైబర్ రేజ్ కలర్స్‌లో ఉండే ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో వస్తుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర మాత్రం రూ.24,999గా ఉంటుంది.

లావా అగ్ని 2 5జీ ఫోన్ కేవలం రూ.21,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లావా అందించే 5 జీ ఫోన్స్‌లో ఆల్‌రౌండర్‌గా పేర్కొనవచ్చు. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లు కంచ్చితంగా మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటాయి.

ఒప్పో ఎఫ్ 23 5 జీ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో సరికొత్త రూపంలో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ రెండు ఆకర్షణీయమైన డిజైన్స్‌లో అందుబాటులో ఉంటుంది. బోల్ట్ గోల్డ్, కూల్‌బ్లాక్ రంగుల్లో ఉండే ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.28,999గా ఉంటుంది.

ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ఫోన్ తన రెనో సిరీస్‌కు కొనసాగింపుగా తీసుకువస్తుంది. ఈ సిరీస్‌లో వచ్చే రెనో 10 ప్రో ప్లస్ ఫోన్‌లో ర్యామ్ విస్తరణ సాంకేతికత ఉంటుంది. దాదాపు ఈ ఫోన్ ర్యామ్‌ను 12 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు వీడియో ప్రాసెసింగ్‌లకు మద్దతునిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.54,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60 ప్రో ఫోన్ ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ మొదటి సారిగా ఈ ఫోన్‌లో 1 టీబీ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ + 128 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 1 టీబీ వేరియంట్స్‌లో వస్తుంది.





























