Tech Tips: మీ ఫోన్ లోకేషన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటే.. ఎంత ఛార్జింగ్ అయిపోతుందో తెలుసా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలొ మొబైల్ ఫోన్ ఒక భాగమైపోంది. అది లేకుండా మనకు క్షణం కూడా గడవదు. అయితే కొన్ని సార్లు మన ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఇందుకు కారణం మన ఫోన్ యూజ్ చేసే విధానం. అంటే మన ఫోన్‌లో లోకేషన్, ఇంటర్నెట్, వైఫైను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అయితే ఎప్పుడూ లోకేషన్ ఆన్‌లో ఉంటే ఎంత ఛార్జింగ్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఉన్న GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) మీ ఎక్కడున్నారనే స్థానాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఉపగ్రహాల నుండి వచ్చే సంకేతాలను ద్వారా మన లోకేషన్‌ను గుర్తిస్తుంది. ఇది స్పీడ్‌గా ఖచ్చితమైన లోకేషన్‌ను ట్రాక్ చేయాలంటే దీనికి ఇంటర్నెట్ లేదా వైఫై అవసరమవుతుంది. అంటే మీ లోకేషన్ ఆన్‌లో మీ ఫోన్ నిరంతరం ఉపగ్రహాలు, నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయబడి, డేటాను మార్పిడి చేసుకుంటుంది. ఈ ప్రక్రియతో మీ ఫోన్‌లో బ్యాటరీపై కూడా లోడ్ పడుతుంది. ఇలా మీఫోన్‌లోని ఏఏ యాప్స్‌కు Google Maps యాక్సెస్ ఉంటుందో ఆ యాప్స్ అన్ని నిరంతరం నావిగేట్ చేయడం వల్ల మీ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అంటే మీ బ్యాటరీ లైఫ్ 1 గంటలో 6% నుండి 15% వరకు తగ్గుతుంది.
లొకేషన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ GPS సిగ్నల్‌ను ట్రాక్ చేస్తుంది. ఒక వేళ మీరు ట్రావెలింగ్‌లో ఉన్నా, లేదా తక్కువ నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్నా.. మీ ఫోన్ ఎక్కువ బ్యాటరీని యూజ్ చేసుకుంటుంది. దీని వలన ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.
మీ బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా లొకేషన్ ఆన్‌లో ఉన్న కూడా మీ బ్యాటరీ త్వరగా అయిపోకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం మీరు అనవసరమైన యాప్స్‌కు లోకేషన్ యాక్సెస్‌ను ఆపేయండి. అవసరమైన యాప్‌లకు మాత్రమే లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీ బ్యాటరీ సేవ్ అవుతుంది.
మీరు ఎప్పుడూ లొకేషన్‌ను ఆన్‌లో ఉంచడానికి బదులుగా, మీరు యాప్‌ను యూజ్ చేసేప్పుడు మాత్రమే దాన్ని ఆన్‌చేసుకోండి. Wi-Fi, మొబైల్ డేటాను తెలివిగా ఉపయోగించండి. అవసరం లేనప్పుడు లొకేషన్‌ను ఆఫ్ చేయండి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




