Android 14: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త అప్ డేట్‌లో స్టన్నింగ్ ఫీచర్..

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఐఫోన్ లో ఉన్నట్లుగానే బ్యాటరీ హెల్త్ ఫీచర్ ను త్వరలో ఆండ్రాయిడ్ లోనూ గూగుల్ తీసుకురానుంది. త్వరలో ఆండ్రాయిడ్ 14 అప్ డేట్ లో ఈ ఫీచర్ను మనం చూడొచ్చని ఆండ్రాయిడ్ రిసెర్చర్ మిసల్ రెహ్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Android 14: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త అప్ డేట్‌లో స్టన్నింగ్ ఫీచర్..
Android 14
Follow us
Madhu

|

Updated on: Jun 06, 2023 | 5:15 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఐఫోన్ లో ఉన్నట్లుగానే బ్యాటరీ హెల్త్ ఫీచర్ ను త్వరలో ఆండ్రాయిడ్ లోనూ గూగుల్ తీసుకురానుంది. త్వరలో ఆండ్రాయిడ్ 14 అప్ డేట్ లో ఈ ఫీచర్ను మనం చూడొచ్చని ఆండ్రాయిడ్ రిసెర్చర్ మిసల్ రెహ్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్యాటరీ మేనేజర్ ఏపీఐ ఉంటుందని, దీని ద్వారా బ్యాటరీ సైకిల్ కౌంట్, చార్జింగ్ స్టేటస్, తయారు చేసి డేట్, బ్యాటరీ హెల్త్ వంటివి తెలుసుకొనే వెసులుబాటు ఉందని వివరించారు. ప్రస్తుతం గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఆండ్రాయిడ్ 14 బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. తర్వలో ఇది అన్ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

ఏపీఐ విడుదలతో, డెవలపర్‌లు ఇప్పటికే తమ పరికరాల బ్యాటరీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వినియోగదారులను అనుమతించే యాప్‌లను తయారు చేస్తున్నారు.  ఓ ఆండ్రాయిడ్ డెవలపర్ ఇప్పటికే బ్యాటరీ ఆరోగ్య గణాంకాలను అందించడానికి ఏపీఐని ఉపయోగించే Batt యాప్‌ని సృష్టించి, ప్రారంభించారు. అయినప్పటికీ, ఏపీఐల విషయంలో, ఈ డేటా పూర్తిగా ఖచ్చితమైనది కాకపోవచ్చు. యాప్ ఏపీఐ అందించిన డేటాను ఉపయోగిస్తుంది, ఇది హార్డ్‌వేర్‌లో ఉన్న ట్రాకర్ల నుండి వచ్చే డేటాపై ఆధారపడి ఉంటుంది.

బ్యాటరీ హెల్త్ స్టాటిస్టిక్స్ కావాలని వినియోగదారుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. 2018 మార్చిలోనే యాపిల్ సంస్థ ఐఓఎస్ 11.3లో ఈ బ్యాటరీ హెల్త్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులు వారి ఫోన్ లోని బ్యాటరీ స్థితి, పనితీరును పర్యవేక్షించడానికి అనుమతించింది, దాని గరిష్ట సామర్థ్యం గరిష్ట పనితీరు, సామర్థ్యం గురించిన వివరాలు పూర్తిగా అందించింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అలాంటి అంశాలను క్రోడీకరించేందుకు వీలు లేదు. ఇప్పుడు ఏపీఐ ఆవిష్కరణతో ఆండ్రాయిడ్ 14 వినియోగదారులకు ఈ బ్యాటరీ హెల్త్ ఫీచర్ అందుబాటులో వస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ మార్కెట్లోకి వచ్చేసినందున ఆ తర్వాత అప్ డేట్ ఆండ్రాయిడ్ 15లో ఈ ఫీచర్ను పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ఆలోచన కూడా గూగుల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలోనే అందుబాటులోకి..

గూగుల్ 2023 ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ 14ని ఆవిష్కరించింది. ఆ తర్వాత మే నెలలో జరిగిన గూగుల్ ఐ I/ఓ 2023 ఈవెంట్‌లో మరిన్ని ఫీచర్లను బహిర్గతం చేసింది. అదే సమయంలో ఆండ్రాయిడ్ 14 బీటా 2ని విడుదల చేసింది.. ఆండ్రాయిడ్ 14 పూర్తి స్థాయి వెర్షన్ ను ఈ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!