కిర్రాక్ కమ్యూనిటీ సేల్ వచ్చేసింది.. ఫోన్లు, టీవీలు, గ్యాడ్జెట్లపై భారీ డీల్స్.. అస్సలు మిస్ అవ్వొద్దు..
OnePlus Community Sale 2023:స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఇయర్ బడ్స్ వంటివి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ వన్‌ప్లస్ తన ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా అన్ని వన్ ప్లస్ ప్రొడక్టులపై అనేక రకాల డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఇయర్ బడ్స్ వంటివి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ వన్‌ప్లస్ తన ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా అన్ని వన్ ప్లస్ ప్రొడక్టులపై అనేక రకాల డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సేల్ జూన్ 4న ప్రారంభం అయ్యింది. జూన్ 11వ తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్లో వన్‌ప్లస్ 11 5G, వన్‌ప్లస్ 11ఆర్, నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్లతో పాటు నోర్డ్ బడ్స్ 2 వంటి అనేక గ్యాడ్జెట్లపై గొప్ప డీల్స్ ను అందిస్తోంది. వన్ ప్లస్ టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ స్పెషల్ ఆఫర్లేంటో చూసొద్దాం రండి
వన్‌ప్లస్ ఎన్సెంబల్ బండిల్.. ఈ బండిల్ లో మూడు ఉత్పత్తులు ఉంటాయి. అవి వన్‌ప్లస్ 11 5జీ (16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్), వన్‌ప్లస్ ప్యాడ్(12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్), వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2. ఈ బండిల్ ప్యాక్ రూ. 115,997 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్ ద్వారా లావాదేవి చేస్తే రూ. 4,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.
వన్‌ప్లస్ 11 5జీ.. కొనుగోలుదారులు వన్‌ప్లస్11 5G స్మార్ట్ ఫోన్ ని రూ. 56,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇంకా, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలు ఈ డీల్‌ను సులభతరం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, మీరు ఇతర వన్‌ప్లస్ ఆడియో ఉత్పత్తులను తగిన డీల్‌గా చేయడానికి తగ్గింపు ధరలకు జోడించి బండిల్ చేయవచ్చు.



వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ రూ.19,999 కి అందుబాటులో ఉంటుంది. మోబీ క్విక్ వ్యాలెట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ 11R 5జీ.. ఈ ఫోన్ ధర రూ. 39,999 వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు బ్యాంక్,ఆన్‌లైన్ డిస్కౌంట్ల ద్వారా ధరను తగ్గించుకోవచ్చు. అదనంగా, మీరు నో కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. ఇంకా, ఇతర వన్ ప్లస్ పరికరాలపై ఆఫర్లను గమనిస్తే, మీరు ఎంపిక చేసిన పరికరాలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా వన్ ప్లస్ 10 ప్రో 5జీ మరియు వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ల పై రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఎంపిక చేసిన పరికరాలపై రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఆఫర్ కలిగి ఉంది.
వన్‌ప్లస్ టీవీ వై సిరీస్.. ఈ టీవీ పై మీరు 41 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ వై సిరీస్ టెలివిజన్ 32-అంగుళాల మోడల్ రూ. 13,999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 1500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ టీవీ క్యూ సిరీస్.. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో 65-అంగుళాల వన్‌ప్లస్ టీవీ క్యూ2 ప్రోని రూ. 94,999 తగ్గింపు ధరతో పొందవచ్చు.
వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 2.. తాజాగా విడుదలైన OnePlus నోర్డ్ బడ్స్ 2 ధర ఈ సేల్ లో రూ.2,999 గా ఉంది. ఇది రెండు రంగు ఎంపికలలో వస్తుంది. అవి, థండర్ గ్రే , లైట్నింగ్ వైట్ రంగులలో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..