Gmail New Feature: జీమెయిల్‌లో మరో స్మార్ట్ ఫీచర్.. ఇక ఫైల్స్ వెతకటం చాలా ఈజీ..
జీమెయిల్ స్మార్ట్ ఫోన్ వెర్షన్ లో మరో అద్బుత ఫీచర్ ను గూగుల్ ఆవిష్కరించంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ వినియోగదారులకు పాత ఫైళ్లను వెతకడంలో బాగా ఉపయోగపడుతుంది.
జీమెయిల్ స్మార్ట్ ఫోన్ వెర్షన్ లో మరో అద్బుత ఫీచర్ ను గూగుల్ ఆవిష్కరించంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ వినియోగదారులకు పాత ఫైళ్లను వెతకడంలో బాగా ఉపయోగపడుతుంది. అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ స్పాట్ లో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జీమెయిల్ లో కొత్త ఫీచర్ ‘టాప్ రిజల్ట్స్’..
స్మార్ట్ ఫోన్లో జీమెయిల్ వినియోగించే వారు యాప్ పైన ‘టాప్ రిజల్ట్స్’ అనే సెక్షన్ ని గమనించవచ్చు. ఈ సెక్షన్లోకి వెళ్లి పాత మెసేజ్లు, మెయిల్స్, అటాచ్మెంట్స్ ని సులభంగా వెతకవచ్చు. ఈ సెక్షన్ లో ఫైల్స్ వెతకడానికి గూగుల్ లోని మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ సాయం చేస్తాయి. మీరు వెతకాలనుకుంటున్న దానికి సంబంధించిన అంశాలను ఏదో ఒకటి జోడించి సెర్చ్ చేసి మీ మెయిల్స్ ను పొందవచ్చు. ఈ ఫీచర్ కోసం చాలా మంది వినియోగదారులు అభ్యర్థిచారని గూగుల్ తన బ్లాక్ స్పాట్ లో పేర్కొంది. రానున్న రెండు వారాల్లో పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది.
ఈ టాప్ రిజల్ట్స్ అనే ఫీచర్ ప్రస్తుతం కేవలం మొబైల్ వెర్షన్లోనే అందుబాటులో ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మరి బ్రౌజర్ ఆధారిత జీ మెయిల్ వెర్షన్ కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందా లేదా అన్ని విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
సెర్చ్ జెయింట్ గూగుల్ 2023 మే నెలలో జరిగిన ఐ/ఓ డెవలపర్ కాన్ఫరెన్స్ లో పలు కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను పరిచయం చేసింది. అలాగే ఓపెన్ ఏఐ ప్రారంభించిన చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన బార్డ్ త్వరలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనుసంధానం కానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..