Odisha Train Accident: ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్ర విషాదంగా మారిపోయింది. ఈ రైలు ప్రమాదంలో 288 మంది వరకు మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇంకా ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం..
ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్ర విషాదంగా మారిపోయింది. ఈ రైలు ప్రమాదంలో 288 మంది వరకు మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇంకా ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసినా.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. సిగ్నల్స్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్ వెల్లడించారు. అయితే, ఈ టెక్నాలజీలో ఏ విభాగంలో సమస్య తలెత్తిందో తెలియాల్సి ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగినట్లు తేల్చారు.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అనేది రైల్వే సిగ్నల్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా వెళ్లేందుకు ఇది టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ రైళ్లకు ఒకే పట్టాలపై వెళ్లకుండా ఇది చూస్తుంది. ఒక రైలు సిగ్నల్ మరో రైలు సిగ్నల్‌తో విభేదించకుండా ఆ మార్గంలోని అన్ని రైళ్లూ కూడా ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొకుండా వెళ్లేలా చూస్తుంది. అయితే వెళ్లే రైలు మార్గం సురక్షితంగా ఉందని, ఆ మార్గంలో వేరే రైళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఇది సిగ్నల్ ఇస్తుంది. ఈ టెక్నాలజీ రైలు ప్రమాదాలు జరుగకుండా చూస్తుంది.
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్, కంప్యూటర్స్ ఉంటాయి. ఇవి ప్రతి రోజు రైళ్ల కదలికలను గమనిస్తుంటాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో చాలావరకు నిర్ణయాలన్నీ సాఫ్ట్‌వేర్‌పైనే జరుగుతాయి. దీని కోసం సెన్సర్లు, ఫీడ్‌బ్యాక్ డివైజ్‌లను ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీ కారణంగా పట్టాలపై వెళ్తున్న రైళ్లు ఏ సమయంలో ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్‌లు, ఇతర డేటా పాయింట్ల నుంచి కూడా ఈ సిస్టమ్‌కు సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది.
యాక్సెల్ కౌంటర్స్ టెక్నాలజీ అనేది ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై ఏదైనా ట్రైన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెక్నాలజీ పట్టాలను భిన్న బ్లాక్‌లుగా విడగొడుతుంది. ఇక్కడ ఒక బ్లాకులో ఒక రైలు మాత్రమే ఉండాలి. దీనికి అనుగుణంగానే సిగ్నిల్స్‌ను ఇస్తుంటారు. ఇక హ్యూమన్ ఎర్రర్, మాన్యువల్ ఇంటర్‌వెన్షన్‌లు వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ఈ టెక్నాలజీలు పనిచేస్తాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి