Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్‌ 8ప్రో నుంచి కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలిస్తే..

గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్‌ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్‌ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం ఈ ఫోన్‌ మార్కెట్లోకి అమ్మకానికి కూడా వచ్చింది. అయితే విడుదల సమయంలో గూగుల్‌ కేవలం 12 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో మాత్రమే తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వేరియంట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది గూగుల్‌. 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ను...

Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్‌ 8ప్రో నుంచి కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలిస్తే..
Google Pixel 8 Pro
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2023 | 9:10 AM

ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లకు పెట్టింది పేరు యాపిల్‌ మాత్రమే అనుకునే వాళ్లం. కానీ ఈ జాబితాలోకి సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌తో పాటు మరికొన్ని బ్రాండ్స్‌ కూడా వచ్చి చేరాయి. యూజర్లను అట్రాక్ట్ చేసే విధంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్ సైతం గూగుల్‌ పిక్సెల్‌ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.

గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్‌ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్‌ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం ఈ ఫోన్‌ మార్కెట్లోకి అమ్మకానికి కూడా వచ్చింది. అయితే విడుదల సమయంలో గూగుల్‌ కేవలం 12 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో మాత్రమే తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వేరియంట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది గూగుల్‌. 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ను రీసెంట్‌గా లాంచ్‌ చేసింది గూగుల్‌.

గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో 12 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,06,999గా ప్రకటించింది. బే, ఒబ్సిడియాన్, పోర్సెలియాన్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 1,13,999గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 9000, ఎక్స్చేంజ్‌ బోనస్‌ ద్వారా రూ. 4000 అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. మిగతా వేరియంట్లకూ ఈ డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ లేటెస్ట్‌ వేరియంట్‌ ఫోన్‌ కేవలం ఒబ్సిడియన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇదిలా ఉంటే గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెషర్ రేట్‌తో కూడిన ఈ ఫోన్‌ స్క్రీన్‌ 1344 x 2992 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ గూగుల్ టెన్సోర్ జీ3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 30 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..