circle to search: ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌.. ఎలా ఉప‌యోగించాలంటే..

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ స‌ర్కిల్ టు సెర్చ్ పేరుతో ఓ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఫొటోలో క‌నిపించే వ‌స్తువు లేదా ప్ర‌దేశంపై స‌ర్కిల్ చేయ‌గానే దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యేవి. అయితే ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ కేవ‌లం కొన్ని...

circle to search: ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌.. ఎలా ఉప‌యోగించాలంటే..
Google
Follow us

|

Updated on: Aug 02, 2024 | 2:53 PM

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ స‌ర్కిల్ టు సెర్చ్ పేరుతో ఓ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఫొటోలో క‌నిపించే వ‌స్తువు లేదా ప్ర‌దేశంపై స‌ర్కిల్ చేయ‌గానే దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యేవి. అయితే ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ కేవ‌లం కొన్ని గ్యాడ్జెట్స్‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసింది. వీటిలో సామ్‌సంగ్‌తో పాటు గూగుల్‌కు చెందిన ఫోన్‌లు ఉన్నాయి.

అయితే తాజాగా గూగుల్ గూగుల్ ఈ ఫీచ‌ర్‌ను డెస్క్ టాప్‌లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు నివేదికలో తెలిపారు. క్రోమ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో పాటు క్రోమ్ బ్రౌజ‌ర్‌లో ఈ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చారు. GizmoChina నివేదిక ప్రకారం, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ప్రస్తుతం ChromeOS 127 బీటాతో పాటు Chrome 128 బీటాలో తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీని రెగ్యుల‌ర్ వెర్ష‌న్ కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా విండోస్‌, మ్యాక్ ఓఎస్‌లో ఈ ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. గూగుల్ లెన్స్‌తో ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని స‌మాచారం.

ఇంత‌కీ ఫీచ‌ర్‌ను ఎలా ఉప‌యోగించుకోవాలంటే.. క్రోమ్ 128 బీటా ఛానెల్‌లో ఓవ‌ర్‌ఫ్లో మెను నుంచి గూగుల్ లెన్స్‌తో సెర్చ్ చేసుకోవ‌చ్చు. ఇక క్రోమ్ ఓఎస్ విష‌యానికొస్తే.. అడ్ర‌స్ బార్‌లోకి వెళ్లి ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. యూజ‌ర్లు ఏదైనా వీడియో చూస్తున్న స‌మ‌యంలో అందులోని ఎంపిక చేసిన ఫొటోకు సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. రానున్న రోజుల్లో ఫీచ‌ర్‌ని మాక్ ఓఎస్‌తో పాటు విండోస్‌లో కూడా తీసుకొచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్స్‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఒక ఫొటో బ్యాగ్రౌండ్‌లో క‌నిపించే ఏదైనా హోట‌ల్‌, లేదా నిర్మాణం ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చు. స‌ద‌రు వ్య‌క్తి ఆ ఫొటోను ఎక్క‌డ దిగాడ‌న్న విష‌యాన్ని ఇట్టే తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ఆ ఫొటోపై స‌ర్కిల్ డ్రా చేస్తే స‌రిపోతుంది. దీంతో వెంటే ఆ ప్ర‌దేశం ఎక్క‌డ ఉంది.? దాని ప్ర‌త్యేకత ఏంటి.? చ‌రిత్ర ఏంటి.? అన్న అన్ని వివ‌రాలు ఇట్టే తెలుసుకోవ‌చ్చు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీ స‌హాయంతో గూగుల్ ఈ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.

మ‌రిన్ని టెక్నాల‌జీ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌..
ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌..
ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే..
: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే..
విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..
విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..
లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీల మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీల మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే
ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. కళ్ల సమస్యలు రానే రావు..
ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. కళ్ల సమస్యలు రానే రావు..
బొప్పాయి సాగుతో రూ.15 లక్షల వరకు ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌
బొప్పాయి సాగుతో రూ.15 లక్షల వరకు ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌
అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: కావ్య మారన్
అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: కావ్య మారన్