AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్‌ అసిస్టెంట్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు..!

గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ అందరికీ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. ఇందులో మనదేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ వంటి తొమ్మది భాషలు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే .. అది వెంటనే మనకు ఇష్టమైన భాషలోకి అనువాదం చేసిపెడుతోంది. ఫారిన్ టూర్స్, […]

గూగుల్‌ అసిస్టెంట్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 18, 2019 | 3:11 AM

Share

గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ అందరికీ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. ఇందులో మనదేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ వంటి తొమ్మది భాషలు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే .. అది వెంటనే మనకు ఇష్టమైన భాషలోకి అనువాదం చేసిపెడుతోంది. ఫారిన్ టూర్స్, లోకల్ టూర్స్‌కు వెళ్లినప్పుడు అక్కడి వారితో కనెక్ట్ అవ్వడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. కొత్త భాషలు నేర్చుకునేవారికి కూడా ఈ ఫీచర్‌ ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది.

తొలుత 2019 జనవరిలో కన్జుమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌)లో.. ఈ ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ గురించి గూగుల్ పరిచయం చేసింది. ఆ తర్వాత కంపెనీకి చెందిన గూగుల్‌ హోమ్‌ డివైజెస్‌, స్మార్ట్‌ డిస్‌ప్లేలలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో బైడిఫాల్ట్‌గా గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్ ఉండగా.. తాజాగా ఇప్పుడు ఐఫోన్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. ఈ ఇంటర్‌ప్రెటర్‌ ఫీచర్‌ను ఐఫోన్‌లో కూడా వాడుకోవచ్చు.

ఈ ఇంటర్‌ప్రెటర్‌ ఉపయోగించడం ఎలా..?

ఈ గుగూల్‌ అసిస్టెంట్‌ ఇంటర్‌ప్రెటెర్‌ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా ఈజీ. మీ స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్‌ అసిస్టెంట్‌ను ఓపెన్ చేసి.. ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ను డైరెక్ట్‌గా ఉపయోగించవచ్చు. ‘ఓకే గూగుల్‌ లేదా హే గూగుల్‌’ అనే వాయిస్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయవచ్చు. లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా.. ఈ గూగుల్‌ అసిస్టెంట్‌ ఓపెన్‌ అవుతోంది. “Hey Google, be my Telugu translator” or “Hey Google, help me English From Telugu” వంటి కమాండ్స్‌తో ఈ ఇంటర్‌ప్రిటెర్‌ ఫీచర్ ఓపెన్‌ అవుతోంది.