Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌.. ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు.. ఒత్తిడిని తట్టుకునే శక్తి

Smartphone Screen Glass: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ఖరీదైన ఫోన్‌ అయిన కింద పడిందంటే స్క్రీన్‌ గ్లాస్‌..

Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌.. ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు.. ఒత్తిడిని తట్టుకునే శక్తి
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Oct 03, 2021 | 8:02 AM

Smartphone Screen Glass: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ఖరీదైన ఫోన్‌ అయిన కింద పడిందంటే చాలు స్క్రీన్‌ గ్లాస్‌ పగలడం ఖాయం. ఫోన్‌ స్క్రీన్‌ అనే కాదు.. గాజు ఏదైనా కాస్త ఒత్తిడి పడితే పగలిపోవాల్సిందే. ఎంత ఖరీదైన ఫోన్‌ ఉన్నా..  స్క్రీన్‌ పగిలిపోయిందంటే చాలు దాని లుక్కే పోతుంది. కానీ.. అత్యంత గట్టిగా ఉండి ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కెనడాకు చెందిన మెక్‌గిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్‌ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అలెన్‌ ఎర్లిచర్‌ చెబుతున్నారు.

ఒత్తిడిని తట్టుకునే శక్తి..

ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌ గ్లాస్‌ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు నెక్ర్‌గా పిలిచే పదార్థం ఉంటుంది. పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్‌ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్‌ (కొన్ని రకాల ప్రొటీన్లు) పదార్థం కలిసి ‘నెక్ర్‌’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్‌ను కలిపి దృఢమైన గ్లాస్‌ను రూపొందించారు. దీని తయారీ సులువని, ధర కూడా తక్కువని ఉంటుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చని ఆయన తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం..!

CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..