WhatsApp: నవంబర్ 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. జాబితాలో మీ ఫోన్ మోడల్‌ ఉందో.. లేదో తెలుసుకోండి..!

WhatsApp: ప్రస్తుతమున్న రోజుల్లో వాట్సాప్‌ లేనిది ఉండటం లేదు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు..

WhatsApp: నవంబర్ 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. జాబితాలో మీ ఫోన్ మోడల్‌ ఉందో.. లేదో తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2021 | 6:29 AM

WhatsApp: ప్రస్తుతమున్న రోజుల్లో వాట్సాప్‌ లేనిది ఉండటం లేదు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ చాటింగ్‌, స్టేటస్‌, అప్‌లోడ్‌, డౌన్‌లో ఇలా రకరకాలుగా వినియోగిస్తూ బిజీగా గడుపుతుంటారు. అలాగే వాట్సాప్‌ కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. యాన్యువల్ అప్‌గ్రేడ్ పాలసీలో భాగంగా వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ స్మార్ట్‌ఫోన్‌ల యూజర్లు వాట్సాప్ వాడేందుకు కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. నవంబర్ తర్వాత వాట్సాప్ రన్ చేయడానికి అనుకూలంగా లేని డివైజ్‌ల జాబితాను సంస్థ ఇంతకు ముందే విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే వివిధ రకాల ఫోన్ మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పాత ఓఎస్​ ఫోన్లకు..

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1, ఆ తరువాత వచ్చిన ఓఎస్‌లతో పనిచేసే డివైజ్‌లలో మాత్రమే వాట్సాప్ పనిచేయనుంది. అలాగే iOS 10, ఆ తరువాత వచ్చిన కొత్త వెర్షన్‌లతో పనిచేసే ఐఫోన్‌లలో మాత్రమే వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు KaiOS 2.5.0, ఆ తరువాత వచ్చిన ఓఎస్‌ డివైజ్‌లు, JioPhone, JioPhone 2 డివైజ్‌లలో మాత్రమే వాట్సాప్ పనిచేయనుంది. అందువల్ల పాత ఓఎస్ డివైజ్‌లు వాడే యూజర్లు వాట్సాప్‌ వాడటానికి ఓఎస్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓఎస్ అప్‌డేట్‌కు సపోర్ట్ చేయని స్మార్ట్‌ఫోన్ యూజర్లు కొత్త డివైజ్‌లకు మారాల్సిందే.

జాబితాలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే:

ఐఫోన్ 6, ఐఫోన్ 6S ప్లస్, ఐఫోన్ SEలకు వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకోనుంది. తరువాత వచ్చిన ఐఫోన్ మోడల్స్ అన్నింట్లో అప్‌గ్రేడ్ చేసిన iOS ఉంటుంది. దీంతో వాటిలో వాట్సాప్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లోని చాలా స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ట్రెండ్ II, గెలాక్సీ SII, గెలాక్సీ S3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్ 2, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్2 వంటి ఏడు శామ్‌సంగ్ ఫోన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ZTE గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, ZTE V956, గ్రాండ్ X క్వాడ్ V987, గ్రాండ్ మెమో… వంటి నాలుగు ZTE డివైజ్‌లు సైతం ఇందులో ఉన్నాయి.

అలాగే ఎల్‌జీ నుంచి విడుదలైన లూసిడ్ 2, ఆప్టిమస్ F7, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L3 II డ్యుయల్, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L5, బెస్ట్ L5 II, ఆప్టిమస్ L5 డ్యుయల్, బెస్ట్ L3 II, ఆప్టిమస్ L7, ఆప్టిమస్ L7 II డ్యుయల్, బెస్ట్ L7 II, ఆప్టిమస్ ఎఫ్ 6, ఎన్‌యాక్ట్, ఆప్టిమస్ L4 II డ్యుయల్, ఆప్టిమస్ F3, బెస్ట్ L4 II, బెస్ట్ L2 II, ఆప్టిమస్ నిట్రో HD, ఆప్టిమస్ 4X HD, ఆప్టిమస్ F3Q డివైజ్‌లకు వాట్సాప్‌ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. అలాగే సోనీ ఎక్స్‌పీరియా మిరో, ఎక్స్‌పీరియా నియో ఎల్‌, ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్‌, డివైజ్‌లలో కూడా నవంబర్ 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు.ఈ డివైజ్‌లు వాడేవారు నవంబర్ 1 లోపు చాట్ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం..!

CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.