Whatsapp: యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. వీటిలో మీ ఫోన్ ఉందా.?
Whatsapp: రకరకాల అప్‌డేట్స్‌ను, ఫీచర్లను తీసుకొచ్చే క్రమంలో యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేసిన సాఫ్ట్‌వేర్‌లకు అనుగుణంగా...
Whatsapp: రకరకాల అప్‌డేట్స్‌ను, ఫీచర్లను తీసుకొచ్చే క్రమంలో యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేసిన సాఫ్ట్‌వేర్‌లకు అనుగుణంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఈ యాప్ సదరు ఫోన్‌లో పనిచేస్తుంది. లేకపోతే అందులో సేవలు పని చేయవు. తాజాగా వాట్సాప్ ఇలాగే కొన్ని పాత ఫోన్‌లలో తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి కొన్ని ఐఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు సమాచారం.
డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం వాట్సాప్ యాప్ అక్టోబర్ నుంచి iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఫోన్‌లలో పనిచేయదు. ఈ మేరకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారికి అలర్ట్స్ కూడా జారీ చేశారని సమాచారం. వాట్సాప్ సేవలను కొనసాగించాలనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్‌లను అప్‌డేట్ చేసుకోమని యాపిల్ సూచిస్తోంది. ఐఓఎస్ 12 లేదా తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లలోనే వాట్సాప్ పనిచేస్తుంది.
అయితే ఇది iPhone 5 , iPhone 5c అనే రెండు iPhone వెర్షన్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుందని సమాచారం. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సాఫ్టవేర్ అప్‌గ్రేడ్‌ను సెలక్ట్ చేసుకొని లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..