Narender Vaitla |
Updated on: Sep 02, 2022 | 9:36 AM
మార్కెట్లోకి రోజుకో కొత్త ఇయర్ బడ్స్ సందడి చేస్తున్న వేళ ఒప్పో కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఒప్పో బడ్స్ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయబడ్స్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.
ఇందులోని AI నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో సౌండ్ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా స్పష్టంగా వినొచ్చు. అలాగే ఇయర్‌బడ్స్ టచ్ బటన్‌లను రెండుసార్లు నొక్కితే ఫోన్‌లోని కెమెరా క్యాప్షర్ అయ్యేలా ప్రత్యేక టెక్నాలజీని అందించారు.
బ్లూటూత్ v5.2ని అందించారు. 10 మీటర్ల పరిధి వరకు కనెక్టివిటీని కలిగి ఉంది. ఇందులో 40mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ లోపల 460 mAh బ్యాటరీ కూడా ఉంది. ఒక్క ఛార్జ్‌పై 7 గంటల బ్యాటరీ బ్యాకప్, 28 గంటల మొత్తం బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
IPX4 రేటింగ్ ద్వారా దుమ్ము, నీటి నుంచి రక్షణ కలిగి ఉంది. 101dB డ్రైవర్ సెన్సిటివిటీ, 20Hz -20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో 10mm టైటానియం డ్రైవర్‌ల ద్వారా పని చేస్తుంది.
ఇక డాల్బీ అట్మోస్‌తో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 1799గా ఉంది. ఒప్పో వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.