- Telugu News Photo Gallery Technology photos LG Launching LG OLED Flex TV LX3 curved and flat tv have a look on tv features Telugu Tech News
LG OLED Flex TV LX3: ఎల్‌జీ నుంచి అధునాతన స్మార్ట్‌టీవీ.. స్క్రీన్‌ను బెండ్ చేసుకోవచ్చు.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
LG OLED Flex TV LX3: ప్రస్తుతం స్మార్ట్‌టీవీలు సందడి చేస్తున్న తరుణంలో ఎల్‌జీ సరికొత్త టీవీని తీసుకొస్తోంది. కర్వ్‌డ్ కమ్ ఫ్లాట్ స్క్రీన్‌తో ఈ టీవీని లాంచ్ చేయనున్నారు. యూపర్‌లో జరిగే IFA 2022లో ఈ టీవీని ప్రదర్శించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేయనున్నారు..
Updated on: Sep 01, 2022 | 9:00 PM

టీవీల తయారీలో ఎల్‌జీ సరికొత్త ఒరవడికి నాంది పలికింది. ఎల్‌జీ ఓఎల్‌ఈడీ ఫ్లెక్స్ టీవీ ఎల్‌ఎక్స్3 పేరుతో ఓ టీవీని లాంచ్ చేయనుంది. ఫ్లాట్‌గా ఉండే డిస్‌ప్లేను కర్వ్‌డ్‌గా డిస్‌ప్లేగా మార్చుకోవడం ఈ టీవీ ప్రత్యేకత. స్క్రీన్‌ను 900 రేడియస్ వరకు బెండ్ చేసుకోవచ్చు.

ఇక టీవీ ఫీచర్ల విషయానికొస్తే 42 ఇంచెస్ 4కే ఓఎల్‌ఈడీ బెండుల్ డిస్‌ప్లేను అందించారు. ఈ టీవీ స్క్రీన్‌ను రిమోట్ ఆధారంగానే బెండ్ చేసుకోవచ్చు. హైట్ కూడా మార్చుకోవచ్చు. డాల్బీ విజన్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.

కంప్యూటర్ మానిటర్‌గా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఎల్‌జీ అల్ఫా 9 జెన్ 5 ప్రాసెసర్‌పై ఈ టీవీ పని చేస్తుంది.

ఈ టీవీలో 40 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు అందించారు. డాల్బీ అట్మోస్ సపోర్ట్ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఫ్లాట్ కమ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తోన్న తొలి టీవీ ఇదేనని చెప్పొచ్చు.

యూరప్‌లో జరగనున్న ఎలక్ట్రానిక్స్ ఫెయిర్ IFA 2022లో ఎల్‌జీ ఈ టీవీని ప్రదర్శించనుంది. అదేరోజు టీవీ ధర ప్రకటించనున్నట్లు సమాచారం.




