Indian Railway: రైల్వే స్టేషన్‌లో నేమ్ బోర్డు పసుపు రంగులో.. అక్షరాలు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే..!
Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. అయితే స్టేషన్‌లలో కొన్నింటిని పెద్దగా పట్టించుకోము. సాధారణంగా రైల్వే స్టేషన్‌లలో స్టేషన్ నేమ్ బోర్డులు..
Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. అయితే స్టేషన్‌లలో కొన్నింటిని పెద్దగా పట్టించుకోము. సాధారణంగా రైల్వే స్టేషన్‌లలో స్టేషన్ నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. రైలు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి స్టేషన్‌కు ఈ స్టేషన్ పేరుతో బోర్డు ఉంటుంది. ఆ బోర్డులు కూడా పసుపు రంగులో ఉంటాయి. నేమ్ బోర్డును గమనిస్తుంటాము కానీ.. ఆ బోర్డు పసుపు రంగులో ఉందుకు ఉంటుందనే విషయం పెద్దగా పట్టించుకోము. అందుకు కారణం కూడా లేకపోలేదు. పసుపు రంగులో ఉండే స్టేషన్ నేమ్ బోర్డుపై అక్షరాలు నలుపు రంగులో ఉంటాయి. ఈ రంగులు రైల్వేస్టేషన్‌లతో పాటు స్కూళ్లు, కాలేజీలు, బస్సులకు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ నేమ్ బోర్డు పసుపు రంగులో ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
ఇతర రంగులతో పోలిస్తే పసుపు రంగే కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఎక్కువగా రిఫ్లెక్షన్ వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తుంది. అందు వల్లే రైల్వేస్టేషన్‌లలో బోర్డులపై పసుపు రంగును వినియోగిస్తుంటారు. పసుపు నేమ్‌బోర్డు వల్ల ప్రయాణికులు దూరం నుంచి కూడా సులభంగా స్టేషన్ పేరును గుర్తిస్తారు. పసుపు రంగుపై కొన్ని రంగులు స్పష్టంగా కనిపించకపోయినా నలుపు రంగు మాత్రం స్పష్టంగా కనిస్తుంది. అందుకే పసుపు రంగుపై నలుపు రంగు అక్షరాలు ఉంటాయి. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఇతర వస్తువులను, బోర్డుల కలర్స్ కంటే పసుపు రంగుపై దృష్టి త్వరగా పడుతుంది. అందుకే బోర్డు పసుపు రంగు, అక్షరాలు నలుపు రంగులను వినియోగిస్తుంది రైల్వే శాఖ.
ఇంకో విషయం ఏంటంటే పసుపు రంగు బోర్డులపై నల్లటి రంగులతో మాత్రమే పేర్లు రాసి ఉంటాయి. అలా రాయడానికి కూడా కారణం ఉంది. వేరే రంగుల్లో పేర్లు రాయడం వల్ల వాటిపై కాంతి పడినప్పుడు రిఫ్లెక్షన్ అవ్వదు. అలా రిఫ్లెక్స్ అయ్యే గుణం ఒక నలుపు రంగుకు మాత్రమే ఉంది. అందుకే రైల్వేస్టేషన్‌లలో బోర్డులపై నలుపు రంగుతో అక్షరాలు ఉంటాయి. స్కూల్, కాలేజీ బస్సులకు కూడా పసుపు రంగును వాడుతుంటారు. అందరి దృష్టి ఆకర్షించడం వల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయని భావిస్తారు. అందుకే ఈ రంగులను వాడుతుంటారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి