AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sim Card: మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

ప్రస్తుతం ఫోన్‌ లేని వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డ్యూయల్ సిమ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిమ్‌ కార్డుల ద్వారా నేరాలు కూడా జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన పేరుపై కొందరు నేరస్తులు సిమ్‌ కార్డులను తీసుకుంటున్న ఉదాంతాలు వెలుగులోకి వస్తున్నాయి...

Sim Card: మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
Active Sim Cards
Narender Vaitla
|

Updated on: Jun 10, 2024 | 1:31 PM

Share

ప్రస్తుతం ఫోన్‌ లేని వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డ్యూయల్ సిమ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిమ్‌ కార్డుల ద్వారా నేరాలు కూడా జరుగుతున్నాయి. మనకు తెలియ కుండానే మన పేరుపై కొందరు నేరస్తులు సిమ్‌ కార్డులను తీసుకుంటున్న ఉదాంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

మరి మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివేట్‌లో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఒక ఐడీ ప్రూఫ్‌పై 9 సిమ్‌ కార్డులను తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయో తెలుసుకోవడానికి కింద పేర్కొన్న స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

* ఇందుకోసం ముందుగా TAFCOP పోర్టల్ tafcop.sancharsaathi.gov.inకి వెళ్లాలి. అనంతరం వెబ్‌సైట్‌లో కనిపించే బాక్సులో మీ మొబైల్ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.

* వెంటనే మీ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

* అనంతరం స్క్రీన్‌పై మీ ఐడీ నుంచి యాక్టివ్‌లో ఉన్న ఫోన్‌ నెంబర్లకు కనిపిస్తాయి.

* ఒకవేళ అందులో మీకు సంబంధించిన నెంబర్‌ లేకపోతే.. మీ నెంబర్ కాదని ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే మీ నెంబర్‌ను ఆధార్‌ కార్డు నుంచి తొలగిస్తారు.

TAFCOP పోర్టల్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రన్‌ చేస్తుంది. ఈ పోర్టల్‌ మొబైల్ కనెక్షన్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. మీ ఆధార్‌ కార్డు ద్వారా ఎన్ని మొబైల్ నెంబర్లు యాక్టివ్‌లో ఉన్నాయి.? ఏయే నెంబర్స్‌ యాక్టివ్‌లో ఉన్నాయి లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ ఐడీతో ఎవరైనా సిమ్‌ను ఉపయోగిస్తుంటే ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఐడిపై ఉన్న సిమ్‌ కార్డు నుంచి ఏదైనా నేరం జరిగితే దానికి మీరే బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..