Flipkart: ఫ్లిప్‌కార్ట్ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్..
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 1 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అన్ని రకాల బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 53,999కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 30,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ రూ.33,999, గెలాక్సీ ఎస్23 5జీ రూ.43,999...
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఆఫర్‌లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో సేల్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోకరణాలు మొదలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైతం ఆఫర్లను అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ సేల్ పేరుతో ఈ సేల్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 1 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అన్ని రకాల బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 53,999కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 30,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ రూ.33,999, గెలాక్సీ ఎస్23 5జీ రూ.43,999, మోటోరొలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ. 20,999, గూగుల్ పిక్సెల్ 7 ప్రో రూ.42,999, పోకో ఎక్స్6 ప్రో రూ.22,999కే సొంతం చేసుకోవచ్చు.
వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ను పొందొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, క్రీడా వస్తువులు, గృహోపకరణాలపై గరిష్ఠంగా 80శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ, ట్యాబ్‌లపై కూడా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్ౌంట్స్ అందిస్తున్నారు. కెమెరాలు రూ.5,034 నుంచి, ట్యాబ్‌ల ధర రూ.7,999 నుంచి ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉంటే అమెజాన్ సేల్‌లో భాగంగా పలు ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వీటితోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో పాటు గృహోపకరణలపై కూడా ప్రత్యేక తగ్గింపు ధరకు అందిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..