- Telugu News Photo Gallery Technology photos Flipkart begins flipkart minutes services in bengaluru to deliver products in just 15 minutes
Flipkart: 15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..
ఈ కామర్స్ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆక్టటుకునే పనిలో పడ్డాయి కంపెనీలు. ముఖ్యంగా వినియోగదారులకు వీలైనంత త్వరగా వస్తువులను డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ అయితే వీటికి పోటీనిచ్చే పనిలో పడింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్. తాజాగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది..
Updated on: Aug 06, 2024 | 7:37 PM

అత్యంత త్వరగా వస్తువులను డెలివరీ చేయడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేుతో కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసిన కేవలం 8 నుంచి 16 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు. ఇన్‌స్టామార్ట్, జెప్టో , బ్లింకిట్ వంటి వాటికి పోటీనివ్వనుంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలను తొలుత బెంగళూరులో ప్రారంభించాయి. త్వరలోనే హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

వినియోగదారులకు కేవలం 15 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్ ఇందులో 100కి పైగా డార్క్ స్టోర్లనుఏర్పాటు చేసింది. దీంతో నగరంలోని నలుమూలల నుంచి వచ్చే ఆర్డర్లను డెలివరీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో ఫాస్ట్ డెలివరీ సేవలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఇంటి కిరాణ సరుకులను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో ఇలాంటి క్విక్ డెలివరీ సేవలకు డిమాండ్ పెరిగింది.

ఇక ఫ్లిప్‌కార్ట్ దేశంలో తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే ఈ కామర్స్ సంస్థల్లో ముందు వరుసలో దూసుకుపోతున్న ఈ కంపెనీ మార్కెట్లో పోటీలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2029 నాటికి క్విక్ డెలివరీ సేవల మార్కెట్ సుమారు 9939 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు





























