Price Drop: స్టన్నింగ్ డీల్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నథింగ్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్!.. ధర తెలిస్తే షాక్!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ తమ అతిపెద్ద సెల్‌లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ రెండు సంస్థలు ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్స్ తీసుకువచ్చాయి. అయితే ఫ్లిప్‌కార్టు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు స్మార్ట్‌ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్స్ ఇస్తుందో ముందుగానే రివీల్ చేసింది. వాటిలో నథింగ్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్ ఇచ్చింది. వాటి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

Nothing Phones
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ తమ అతిపెద్ద సెల్‌లను ఈ నెల 23 నుంచి కస్లమర్లకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇందులో భాగంగా వివిధరకాల ఉత్పత్తులపై ఈ సంస్థలు భారీ డిస్కౌంట్‌ను అందించనున్నాయి. ముందుగా ఫ్లిఫ్‌కార్ట్ బిగ్‌బిలియన్ డే సేల్ గురించింది మాట్లాడుకుంటే. ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై భారీ అఫర్స్ ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ సంస్థ తన ఉత్పత్తులైన ఫోన్ 3ఏ, 3ఏ ప్రో, CMF ఫోన్ 2 ప్రో, వంటి ఫోన్‌ల డీల్స్‌ను ముందుగానే రివీల్ చేసింది. ఫోన్‌ల వారిగా వాటి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
సేల్‌లో నథింగ్ ఫోన్స్‌పై ఉన్న ఆఫర్స్ ఇవే
- నథింగ్ ఫోన్ 3a ప్రారంభం రూ. 22,999 గా ఉండే ఇది సేల్‌లో రూ. 20,999 లభించనుంది.
- నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 27,999గా ఉంటే సేల్‌లో రూ. 24,999లకు రానుంది.
- ఇక CMF ఫోన్ 2 ప్రో బేస్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంటే సేల్‌లో ఇది కేవలం రూ. 14,999కే లభిస్తుంది.
- మరో ముఖ్యమైన డీల్ ఏమిటంటే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 యూజర్స్ కోసం కంపెనీ ఒక ప్రత్యేక అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్స్ తమ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే.. నథింగ్ ఫోన్ 3ని కేవలం రూ. 34,999కి పొందవచ్చు.
- అయితే ఈఫోన్ జూలైలో లాంచ్ అయినప్పుడు దీని ధర రూ. 79,999 ఉండగా ప్రస్తుతం ఇది ఆఫర్‌లో రూ. 34,999కి రానుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




